Do all religions same? Read this

వివిధ మతాల  మధ్య బేధాలని చర్చించవలసిన ఆవశ్యకత

 *రచన: శ్రీ రాజీవ్ మల్హోత్రా
అనువాదం: వడియాల రంజిత్*

రాజీవ్ మల్హోత్రా గారు ఇంగ్లీష్ లో రాసిన వ్యాసాలలో నేను అనువదించిన మొదటి వ్యాసం ఇది. దీనిని దయచేసి చదివి షేర్ చెయ్యండి.

ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సంస్కృతుల గాలులు నా ఇంటి మీదగా వీచడాన్నినేను ఆహ్వానిస్తాను. కానీ, ఎట్టి పరిస్తితులలో ఆ పరాయి సంస్కృతుల గాలిలో నేను కొట్టుకుపోను – మహాత్మా గాంధి

నేటి ఆధునిక సమాజం లింగ, జాతి, కుల, వర్ణ తదితర వివక్షతలను నిరసిస్తోంది. మరో విదంగా చెప్పాలంటే, నేటి సమాజం మానవులలో ఉన్న విభిన్నతలను అంగీకరించడమే కాక దానినో గొప్ప లక్షణంగా బావిస్తోంది. పురుషాహంకారాన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న స్త్రీవాదుల నుండి, “విశ్వజనీనంగా” భావించబడుతున్న పాశ్చాత్య సంస్కృతిలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఇమిడిపోకుండా, ఎంతో విలక్షణమైన మరియు ప్రత్యేకమైన తమ సంస్కృతిని గర్వంగా ప్రకటించుకొని, నిలబెట్టుకొన్న ఆఫ్రికా నల్ల జాతికి చెందిన అమెరికన్ల నుండి, నేను ఎంతో స్పూర్తి పొందాను.

పైన ఉదాహరించిన వాటన్నిట్లో, ప్రత్యామ్నాయ దృష్టికోణం, ఆయా సమయాల్లో ప్రబలంగా ఉన్న, పాతుకుపోయిన, ప్రమాణము మరియు సార్వజనీనము వలే చాలామణీ అవుతున్న వాదాలతో, వర్గీకరణలతో,  నేరుగా తలపడటం మనం చూడవచ్చు. కానీ మనం ఇప్పటికీ వివిధ స్థాయిలలో జరుగుతున్న అంతర్మత చర్చలలో, విస్వజనీనంగా చలామణీ అవుతున్న పాశ్చాత్య దృక్పదాన్ని సవాలు చెయ్యడానికి సంశయిస్తున్నాము. ఈ సమావేశాలలో ఇప్పటికీ ‘పర మత సహనం’ పేరుతో ఇతర మతాలను సహించడమే గొప్ప విషయం అని తీర్మానాలు చేస్తున్నాము. అయితే ఈ చర్చలని ‘పర మత సహనం’ నుండి అన్ని మతాల మధ్య ‘పరస్పర గౌరవం’ పెంపొందించే దిశగా ముదుకు తీసుకువేళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది 

అయితే వేరొక మతం, తమ మతంకన్నా ఎందుకు బిన్నమైనదో తెలుసుకొని, ఆ తేడాని అంగీకరించి, ప్రశంసించగలిగినప్పుడు మాత్రమే, ఇది సాధ్యమవుతుంది. ఈ విదమయిన దృక్పదం, మతపెద్దలని, ఆలోచనాపరులనీ మాతాల మధ్య ఉన్న వ్యత్యాసాలని/బెదాలని నిజాయితీగా తెలుసుకొనేలా, “అన్ని మతాలూ ఒక్కటే” అనే అసత్య వాదాన్ని వదిలేలా ప్రేరేపిస్తుంది. “అన్ని మతాలు ఒకేలంటివి కావు”, అంటే నా ఉద్దేశం ఒకదానికంటే ఇంకోటి మెరుగైనది అని కాదు. మామిడి పండు వేరు, అరటి పండు వేరు అంటే దానర్దం ఒక దానికంటే ఒకరి మెరుగైనది అని కాదు కద. 

వివిధ మతాల మధ్య ఉన్న తేడాలని గురించి చర్చించడం పై, ఆ తేడాలని సానుకూల దృష్టితో అర్దం చేసుకోవటంఫై మన సమాజంలో ఎంతో బలంగా ఉన్న వ్యతిరేకతని గురించి నేను వివిధ సందర్బాలలో వ్రాయడం జరిగింది. వివిధ మతాల మధ్య ఉన్న తేడాలని ‘సహజంగా’ కాక ఒక ‘సమస్యగా’ భావించే ఈ మానసిక దురవస్థని నేను “వ్యత్యాస ఆందోళన” అని వ్యవహరిస్తాను. దీనికి గల కారణాలని నా “బీయింగ్ డిఫరెంట్” పుస్తకంలో వివరంగా చర్చించాను. వివిధ మతాల/నాగరికతలకు చెందిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక మరియు చారిత్రికమయిన విలక్షణలతలను గుర్తించి, అంగీకరించడమే కాక, తమ నాగరికతని, సంస్కృతిని విశ్వజనీనం అని అందరి చేతా అంగీకరింపచేయ్యాలనే పాశ్చాత్యుల ప్రయత్నాలని సవాలు చెయ్యడం ద్వారా మాత్రమే అంతర్మత చర్చలు ఫలితాలని సాధించగలవు 

“ప్రపంచీకరణ అంటే పాశ్చాత్యీకరణే”, అనే వాదానికి చైనా, ఇస్లామిక్ దేశాలు చక్కని వ్యతిరేక ఉదాహరణలు గా నిలుస్తున్నాయి. హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన వేమింగ్ టు, చైనా సమాజం ఆధునికతకి వ్యతిరేకం కాదని, కాని ఆ ఆధునీకరణ, చైనాకే చెందిన ప్రముఖ తత్వవేత్త కన్ఫ్యుషియస్ ఆధారంగానే ఉంటుంది కాని పాశ్చాత్య నాగరికత ఆధారంగా కాదని స్పష్టం చేస్తారు. అలానే ఇస్లామిక్ దేశాలు కూడా తమదయిన ప్రత్యామ్నాయ దృక్పదాన్ని కలిగిఉన్నాయి.

హిందూ మతానికి వేరే మతాలకి మధ్య ఉన్న వైరుధ్యాలని చర్చించడాన్ని వ్యతిరేకుస్తున్న వారు ఎక్కువ మంది, పాశ్చాత్య నాగరికత ప్రభావానికి లోనైన భారతీయులే అవ్వటం గమనార్హం. ఎందరో ఆధునిక భారతీయులు, మనమందరం “ఒక్కటి” కాదా? “విశ్వజనీనమైన” ఒక ద్రుష్టి కోణం కలిగి ఉండటంలో తప్పేంటి? లక్షల మంది పాశాత్యులు యోగ చెయ్యటం, మన వంటకాలని ఆదరించడం గొప్ప విషయం కాదా? లాంటి ప్రశ్నలు వేస్తారు. ఐతే ఇటువంటి నాగరికతల సంగమం ఎప్పుడూ భిన్నత్వాన్ని రక్షించదు సరికదా, అసమానతలని ప్రోత్సహిస్తుంది. మరో విధంగా చెప్పాలి అంటే సమానత్వం పేరుతో చివరికి పాశ్చాత్యులకి చెందిన, వారు ఒప్పుకొన్న, చారిత్రక, పౌరాణిక మరియు మతపరమైన నమ్మకాలు మాత్రమే మిగులుతాయి. అంటే ప్రస్తుతం వాళ్ళు చెప్తున్న సమానత్వం సాదించాలి అంటే మనం మనలా బ్రతకడం మానేసి వాళ్ళలా బ్రతకాలి.

ఇతర నాగరికతలని చెందిన ఒక్కో అంశాన్ని ముక్కలు చేసి, వాళ్లకు కావాల్సిన విదంగా పునర్నిర్మించుకొని, పాశ్చాత్యులు తమ నాగరికతలో కలిపెసుకొనే ఈ ప్రక్రియని నేను “జీర్నీకరణ” (Digestion) అని పిలుస్తాను. ఎలా ఐతే ఒక పులి మేకను తినేసి, తన శరీర ధర్మానికి సరిపోయేదంతా జీర్ణం చేసుకొని, మిగిలింది వ్యర్ధంగా విసర్జిస్తుందో, అలానే పాశ్చాత్య నారగారికత “జీర్నీకరణ” ప్రక్రియ ద్వారా ఇతర నాగారికతలని ముక్కలు చేసి, తమ నాగరికతకి సరిపోయే వాటిని కలిపేసుకొని, మిగిలిన వాటిని వదిలి వేస్తుంది. అలా వదిలివేయబడ్డవి తరువాత దేనికి ఉపయోగపడవు. ఒక ఉదాహరణ ద్వారా ఈ “జీర్నీకరణ” ప్రక్రియని వివరించడానికి ప్రయత్నిస్తాను. యోగం లో 8 అంగాలు ఉన్నా, పాశ్చాత్య దేశాలలో యోగా అంటే కేవలం ‘ఆసనం’ మాత్రమే అనే స్థితి ఎక్కువగా ఉంది. మిగిలిన 7 అంగాలలోని అంశాలలో చాల వరకు, క్రీస్టియన్ సిద్ధాంతాలకి పోసగకపోవడమే దీనికి కారణం. యోగాభ్యాసంలో తప్పనిసరి అయిన ‘శాకాహారం’ కాని, ‘మంత్రం’ కాని, పాశ్చాత్యులు అభ్యసిస్తున్న యోగా లో కనబడవు. అలానే మనలోని పరమాత్మని తెలుసుకోగలిగే ‘సమాధి’ ప్రస్తావన ఆధునిక యోగా లో కనబడదు. ‘శాకాహారం’, ‘మంత్రం’, ‘మనలోనే ఉన్న పరమాత్మను తెలుసుకోవడం’ వంటివి క్రీస్టియన్ మత సిద్ధాంతానికి వ్యతిరేకం కావటమే దీనికి కారణం. ముందుగా ఇలా ముక్కలు చేసిన అంశాలలో తమకి తగినవి తమలో కలిపెసుకోవటం ఈ జీర్నీకరణ ప్రక్రియలో మొదటి అంగం. రెండవ అంగంలో, ఇలా కలిపెసుకొన్నవి తమవిగా చూపించడానికి ప్రయత్నాలు మొదలవుతాయి. ఆ ప్రక్రియ కూడా ఇప్పడీకే ప్రారంభం అయ్యింది. ‘క్రిస్టియన్ యోగా’ అందులో భాగమే. అందుకే యోగా కి హిందూ మతానికి సంబంధం లేదు, ఇది అందరికి సంబంధించింది అనే మాటలు చాలా ప్రమాదకరం. దీని వాల్ల చివరికి యోగా మనది కాకుండా పోయినా ఆశ్చర్యం లేదు. ఈ విదంగా మనం ఇప్పటికే చాలా కోల్పోయాం. ఇప్పటికయినా జాగ్రత పడకపోతే, మన నాగరికత కూడా అంతమైపోవడం ఖాయం. ‘రోమన్ నాగరికత’, యూరోప్ లోని ‘పేగన్ల నాగరికత’, “నేటీవ్ అమెరికన్” నాగరికతలతో సహా మరెన్నో నాగరికతల్ని నాశనం చేసిన చరిత్ర పాశ్చాత్య నాగరికతకి ఉంది. ఈ ప్రక్రియ చివరిలో పాశ్చాత్య నాగరికత మరింత శక్తివంతమవుతుంది, మన నాగరికత కూడా రోమన్, పేగన్, నేటీవ్ అమెరికన్ నాగారికతలవలే, పురాతన వస్తు ప్రదర్శన శాలలకి  పరిమితమైపోతుంది. 

ఈ విషయాలని గుర్తుంచుకొని, తదనుగుణంగా మనం వ్యూహరచన చెయ్యాలి. ‘పూర్వ పక్ష’ ప్రక్రియ ద్వారా వారి నాగరికతని మనం అధ్యాయం చెయ్యటం ఆ వ్యూహంలో ఒక ముఖ్యమైన అంగం. గత 20 పైగా సంవత్సరాలుగా నేను చేస్తున్నది అదే. ఈ ప్రక్రియలో భాగంమే నేను వ్రాసిన పుస్తకాలు (Breaking India, Being Different, Indra’s Net, Battle for Sanskrit, Academic Hinduphobia)     

ఈ జీర్నీకరణని సమర్ధించే వాళ్ళూ లేకపోలేదు. “నాగరికతల కవాతు” (March of Civlizations) అనే సిద్ధాంతం ఆధారంగా ఈ సమర్ధన జరుగుతుంది. ఈ సిద్ధాంతం ప్రకారం పాశ్చాత్యులు ప్రపంచానికి కేంద్ర స్థానంలో ఉంటూ దానిని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత వహిస్తారు. అందులో భాగంగానే వాళ్ళు మిగిలిన అన్ని నాగరికతలలోని, తమకు సరిపడే విషయాలని తమలో కలిపేసుకొని, ఆ నాగరికతల్ని నాశనం చేస్తూ వస్తున్నారు.

ఈ “నాగరికతల కవాతు” సిద్ధాంతం ప్రకారం, పాశ్చాత్యేతర నాగరికతలను మూడు వర్గాలుగా విభజించారు

పాశ్చాత్యులచే ‘కనుగొనబడ్డ’ నాగరికతలు. వీరి ప్రస్తుత కాలం పాశ్చాత్యుల గత కాలంతో సమానం.
పాశ్చాత్యులు నాగరికతని నేర్పిoచవలసిన నాగరికతలు (భారత నాగరికత ఇందులో భాగం)
పాశాత్యుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే నగారికతలు, అనగా వారు ఆక్రమించుకోని నాశనం చేయ్యాల్సినవి

మనం వారి నుండి నాగరికతని నేర్చుకోవాల్సిన దుస్తితిలో ఉన్నామనుకోనేవాళ్ళు జీర్నీకరణను సమర్దించవచ్చు

ప్రపంచంలో ప్రతీ నాగరికతనీ సమానంగా చూడవలసిన అవసరం ఉంది. ఏ నాగరికత కూడా, ఇంకో నాగరికతని, పరిశీలించి, పరిశోధించే విషయ వస్తువు స్థాయికి దిగాజార్చకూడదు.
       
నేను వ్రాసిన ‘బీయింగ్ డిఫరెంట్’ లో, ధార్మిక మతాలకి (హిందు, బౌద్ధం, జైనం, శిఖ్ఖు) అబ్రహం సంబంధ మతాలకి (క్రిస్టియానిటీ, ఇస్లాం, యూదు) మధ్య ఉన్న వైరుధ్యాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.

Comments