అరవై నాలుగు యోగీనీల నామములు- 64 yōgīnī Names who Served lalitātripurasuṁdari dēvī

గజాననా, సింహముఖీ,గృద్ర్ధస్యా,కాకతుండికా | ఉష్ట్రగ్రీవా, హయగ్రీవా,వారాహీ, శరభాననా||

ఉలూకికా,శివారావా, మయూరీ, వికటాననా | అష్టవక్రా, కోటరాక్షీ, కుబ్జా, వికటలోచనా||

శుంష్కోదరీ, లలజ్జిహ్వా, శ్వదంష్ట్రా, వానరాననా | ఋక్షాక్షీ, కేకరాక్షీ, చ బృహిత్తుండా, సురాప్రియా|

కపాలహస్తా, రక్తాక్షీ, శుకీ, శ్యేనీ, కపోతికా | పాశహస్త , దండహస్త, ప్రచండా, చండవిక్రమా||

శిశుఘ్నీ, పాపహంత్రీ, చ కాళీ, రుధిరపాయినీ | వసాధయా, గర్భభక్షా శవహస్తాంత్రమాలినీ||

స్థూలకేశీ, బృహత్కుక్షి:, సర్వాస్యా, ప్రేతవాహనా | దందశూకకరా, క్రౌంచీ, మృగశీర్షా, వృశాననా||

వ్యాత్తాస్యా, ధూమనిశ్శ్వా సా వ్యోమైక చరణోర్ధ్వదృక్ | తాపనీ, శోషణీదృష్టి: , కోటరీ, స్థూలనాసికా||

విద్యుత్ర్పభా, బలాకాస్యా, మార్జారీ, కటపూతనా | అట్టాట్టహాసా, కామక్షీ, మృగాక్షీ, మృగలోచనా||

ఫలశృతి: అరవై నాలుగు నామములును, కలిగి కాశీక్షేత్రమునందు సంచరిస్తున్న ఈ యోగీనీల నామాలను ప్రతిదినము మూడు పూటలా ఎవరు పఠించెదరో, వారికి దుష్టబాధలు నశించును. ఢాకినీ, శాకినులుగాని, కూశ్మాండ యక్షరాక్షసులు గాని ఈ నామాలను జపించువారిని ఎంత మాత్రము పీడించరు. శిశువులకు, మాతృగర్భానికి రక్షణ కల్పింతురు. ఈ యోగినీ పీఠాన్ని సేవించువారు అభీష్టసిద్ధిని పొందగలరు. ఈ యోగినీ గణము కాశీ లో గల మణికర్ణికకు ఎదురుగా వుండెదరు. వారికి నమస్కరించిన చాలును. ఎట్టి విఘ్నాలు కలుగవు. ఇది స్కాందపురాణము నందలి కాశీఖండమునందు నలుబది ఐదవ అధ్యాయమున పేర్కోనబడియున్నది.

Comments

Post a Comment