ఏకాక్షర నిఘంటువు ----ఎ.వి.రమణరాజు
అ - బ్రహ్మ,విష్ణువు, శివుడు, తాబేలు, ముంగిలి, యుద్ధము,
గొప్ప తనము, అంత:పురము, హేతువు, భూషణము,
పాదము, పార్వతి, యజ్ఞము, చంద్ర బింబము, గాయత్ర్యాది
మంత్రము, చక్రము, కోడితల, బృహస్పతి, గాలి, సిగ, గుఱ్ఱము,
లేమి, కొంచెము మొదలైనవి.
అ: - సిద్ధమంత్రము, సూర్యాశ్వము, చంద్రబింబము, కోడితల,
పగ్గము, సిగ. బ్రహ్మ, నారాయణుడు, పరమేశ్వరుడు,
ఒక రౌద్రబీజము, మృత్యునాశక బీజాక్షరము.
అమ్ - ఆకాశబీజము, విష్ణుబీజము, వృక్షబీజము, వంశీకరణ బీజము,
హేతువు, భూషణము, స్వల్పము, త్వర, వంకర మాట, దోసిలి,
అనుస్వారము, బిందువు, ముంగిలి, యుద్ధము,
అంతిపురము, పాదము.
అత్ - నిరంతర గమనము
అర్హ్ - పూజించుట
అయ్ - వెళ్ళుట
అక్ - పోవు, ప్రాకు
అంశ్ - పంచి ఇచ్చుట
అగ్ - వీచు, పోవు
అంక్ - వంకరగా పోవుట, ముద్రవేయు, గుర్తు పెట్టు,
మలినముచేయు, పోవు
అప్ - ఉదకము(నీరు)
అచ్ - పోవు, కదలు, గౌరవించు, ప్రార్థించు
అంచ్ - పూజించు, వంగు , గౌరవించు, ప్రార్థించు, గొణుగు
అంజ్ - ప్రకాశించు, అభిషేకము చేయు, అలరించు, ప్రేరణ
అట్ - తిరుగు. సంచరించు
అణ్ - శ్వాసించు, జీవించు, ధ్వనించు
అత్ - నడచు, తిరుగుట, కట్టివేయు
అద్ - తిను, చంపు
అన్ - గాలిపీల్చు, కదలు, జీవించు, కాపాడుట,
సంతోషపరచుట, తృప్తినొందుట,
అనుగ్రహముచూపుట, దయచూపుట
అయ్ - పోవుట, లోనికి వచ్చుట
అర్థ్ - యాచించుట, కోరుట
అశ్ - వ్యాప్తమగుట, పూర్తిగా నిండుట, ప్రవేశించుట,
చేరుట, పొందుట, అనుభవించుట, తినుట,
రుచిచూచుట
అస్ - అగుట, ఉండుట, విసరుట, విడచుట, పోవుట,
తీసికొనుట, ప్రకాశించుట, పట్టుకొనుట
అర్ఘ్ - వెలకట్టుట
అర్చ్ - పూజించుట, గౌరవించుట
అర్ - సంపాదించుట, బాధించుట, పీడించుట,
యాచించుట, పోవుట.
ఆ - స్థానము, భావము, పరితాపము, బ్రహ్మదేవుడు, కోపము,
తలంపు, వాక్యపూరణ, ఆక్షేపము, ఆశ్చర్యము, సంతోషము,
వైరాగ్యము, ప్రభావము, సంబోధనము, బలము, కడవ, బరువు,
పూజ, తాత, మంగళసూత్రము.
ఆః - స్థానము, భావము, సంతాపము, బ్రహ్మ, శివుడు, కోపము,
ఆక్షేపము, తలపు, అచ్చెరువు, సంతసము, విరాగము, ప్రబోధము,
సంబోధనము, బలము, బరువు, కడవ, పూజ, తాత, మంగళసూత్రము,
దుఖము, శమము, సదాచారము, ముఖము, ఉనికి, లక్ష్మి, బ్రహ్మ, వాక్కు,
హద్దు, పీడ,
ఆమ్ - అంగీకారము, స్మరణ, నిశ్చయము, జవాబు, పాశము,
ఒక ఆకర్షణీయ బీజము.
ఆఙ్ - స్వల్పము. వరకు, గ్రహించుట, కప్పుట, పూరించుట,
కోపగించుట, కౌగిలించుట, తిట్టుట, కోరుట, కాలక్షేపము,
వేడుక, దగ్గర, వంచనము, బంధము, నిరోధము, విరోధము,
సంహారము, స్నానము, వాడుక, చూచుట, హద్దు, ఆలోచించుట,
బుద్ధి, ఈవి, పరాధీనము, భూషణము, సంభాషణ, ఎదురు,
ఆక్రమణము, జీవనోపాయము, మరుపు, నమ్మిక, ప్రయత్నము,
భోజనము, సంబోధనము, పూజ, బడలిక, వాత్సల్యము, సంచయము.
ఆప్ - పొందుట, చేరుట, పోవుట, వ్యాపించుట,
కలిగించుట, ఆక్రమించుట.
ఆస్ - కూర్చుండుట, పరుండుట, విశ్రాంతిగైకొనుట,
నివసించుట, ఊరకుండుట, మరియు
ఈ సందర్భాలలో అస్ అని వాడతారు-
స్మరణము, క్రోధము, బాధ, దుఃఖము,త్రోసిపుచ్చుట.
ఇ - పాము, రత్నము, కాంతి, ముందు,రహస్యార్థము,
శివుడు, ఆడ ఏనుగు, అంతిపురము, చంద్రకిరణము,
మన్మథుడు, చిత్రము, వంత, శబ్దము, మంట, అగ్రము,
(ఆశ్చర్యము, భేదవాక్యము), వెళ్ళుట, అధ్యయనముచేయుట
ఇ: - శివుడు, మన్మథుడు, చంద్రకిరణము, పాము, మణి, కాంతి,
ఆడ ఏనుగు, గుహ, దుఖభావన, పరితాపము, కోపము,
ఎదురు, ఇంటిలోపలిచోటు.
ఇమ్ - పుష్టినిచ్చుచు క్షోభరముకానట్టి ఒక బీజము.
ఈ - కోపము, దుఖము, లక్ష్మి, సరస్వతి, గౌరి, నాలుక,
తామరఱేకు, కేసరము, బాణము, సర్పము, మొలనూలు,
దయ, చింత, దగ్గర.
ఈ: - లక్ష్మి, సరస్వతి, తామరఱేకు, నాలుక, ఇంద్రధనస్సు,
గుహ, బాణము, పాము, కమల కేసరము.
ఈక్ష్ - దర్శించుట
ఈమ్ - ఇది పిమ్మట, వాక్ప్రసాదకర నిర్మలబీజము.
ఈశ్ - పాలించు, అధికారముచేయు,
సమర్థుడగు, సంపాదించుకొను
ఈహ్ - తలంచు, కోరు, పొందు, లక్ష్యముచేయు
ఉః - రాజు, నేత్రము, ఈశ్వర జటాజూటము, విష్ణువు, శివుడు,
పిలుచుట, కోపము, అంగీకారము, అడుగుట, క్షత్రియుడు,
ఉం - విష్ణువు, శివుడు, రాజు, కన్ను.
ఉ - శివుడు, సంబోధనము, కోపము, తపము,
ప్రశ్నము, విహరించుట, దయ, శబ్దపూరణ,
పాదపూరణ.
ఉక్ష్ - తడపు, చల్లు, పంపు
ఉచ్ - ప్రోవుచేయు, ఇష్టపడు, తగియుండు, అలవాటుపడు
ఉజ్ఝ్ - విడిచిపెట్టు, తప్పించుకొను
ఉంఛ్ - ఏరు, ప్రోగుచేయు
ఉత్ - ప్రకాశము, విభాగము, బలాధిక్యము, స్వస్థతలేకుండుట,
సామర్థ్యము, ప్రధానము, కట్టుట, అభిప్రాయము,
మోక్షము, లాభము, మొదట చేయదగిన విధి
ఉమ్ - పురుషుడు, చంద్రుడు, రాజ పుత్రుడు, కంఠము,
దేవత, ప్రాంగణము, సామ్యము, నిండుకడవ,
వర్తకుడు, రక్షణము, బ్రహ్మ, గుర్తు, శివుడు,
పోలిక, రక్కసుడు.
ఊర్ణ్ - కప్పుట
ఉద్ - ఈ క్రింది అర్థములలో ఉపయోగింప బడుతున్నది
ఉన్నతస్థానము, వినియోగము, బయట, నుండి,
పైకి పోవుట, సంపాదించుట, ప్రచారము, ఆశ్చర్యము,
ఉత్కంఠ మొదలైనవి.
ఊ - వాక్యారంభము, రక్షించుట, గురుస్వరూపము, ఇచ్ఛ, స్వామ్యం
ఊం - కోపంతో పలుకుట, అడుగుట, నింద, పోటి
ఊః - పురుషుడు, చంద్రుడు, రాజపుత్రుడు, కంఠము, దేవత,
గొప్పముంగిలి, సాటి, నిండుకడవ(పూర్ణకుంభం),
వర్తకుడు, రక్షించుట, రక్షకుడు, మహేశ్వరుడు,
పోలిక, , ఇంద్రుడు
ఋ - వాక్యము, నిందించుట
ఋధ్ - వృద్ధినొందుట, వర్ధల్లుట, తృప్తినొందుట
ౠ - వాక్యము, కాపాడుట, నింద, భయము
ౠః - తలవెండ్రుక, పాము, చూపు, దరిద్రుడు, స్వర్ణము,
కమలము, స్వర్గము, డబ్బు, నేరేడుచెట్టు, భైరవుడు,
దానవుడు
ౠమ్ - సమ్మోహనకరమూ ఉజ్వలమూ అయిన ఒక బీజాక్షరం
ఌ - విద్వేషకర మోహన బీజాక్షరము. ఊసరవెల్లి, పర్వతము,
శరీరము, క్షేమంకరుడు, దేవత, విలాసగమనము,
కన్ను, తల్లి, ఎముక, కద్రువ
ఌః - శివుడు, ఏనుగుదంతము, ఎండ్రకాయ, కోతి, కోర,
స్వర్గము, అదితిదేవి, గంధము మొదలైన వాటిచే
పూయబడిన శరీరము, చనిపోయిన మనుమడుగలవాడు,
ఱొమ్ము, కాపాడుట.
ౡ - ఊసరవెల్లి, పర్వతము, శరీరము, శుభమును చేయువాడు,
దేవత, విలాసగమనము, కన్ను, ఎముక, కద్రువతల్లి, స్త్రీ,
కేవల మోహనకరమగు ఒక బీజాక్షరము.
ఏ - తేజస్సు, ఉదకము, రాత్రి, మేడయొక్క మధ్యభాగము,
విష్ణువు. ఆకాశము, మణిమధ్యభాగము, సన్నిధి, ఏవార్థకము,
సూర్యోదయకాలమునకు, పదకొండవ సంఖ్యకు,
(దుఖ:భావనము, కోపము, ప్రత్యక్షము, సమీపము)
ఏ: - విష్ణువు
ఏజ్ - వణకుట, కదలుట, ప్రకాశించుట
ఏధ్ - వృద్ధినొందుట, సుఖముగా జీవించుట
ఏమ్ - సర్వవశ్యకర శుద్ధ తత్త్వబీజము.
ఐ - హస్తము, దిక్కు, పర్వతశిఖరము, చర్మము,
విష్ణువు, శివుడు, స్మరణము, ఆహ్వానము,
నియంత్రణము, స్మృతి, ఆకలింతకుతెచ్చునది,
పిలుచుట, మీ ఇష్టమని చెప్పుట,
బిందులేనివాగ్భవబీజము
ఐమ్ - వాగ్బీజము, పురుషవశ్యకరము,
శుద్ధ సాత్వికమునగు బీజాక్షరము.
ఓ - కమలము, గోడ, ఉదకము, కుబేరుడు, చంద్రుడు,
మేఘము, యోని, బృహస్పతి, ఇంద్రుడు, బ్రహ్మదేవుడు,
సందేహము, స్మరణము, మొల, పిలుచుట(సంబోధనము,
ఆహ్వానము)
ఓ: - బ్రహ్మ
ఓమ్ - ప్రణవ బీజము, సమస్తవాఙ్మయరూపము,
నిత్య శుద్ధమునగు బీజము, ఈశ్వరుడు, స్వీకారము.
ఓం - పరమాత్మ, ఆరంభము, మంగళము
ఔ - కుమారస్వామి, స్వచ్ఛమైన మేనికి పేరు, చంద్రకళ,
సిద్ధులవిమానము, అనంతుడనే సర్పము,సంబోధనము,
ఆహ్వానము, విరోధము, నిశ్చయము.
ఔ: - శబ్దము, అనంతుడు, భూమి.
ఔమ్ - సర్వవాఙ్మయప్రదము, వశ్యకరమునకు ఒక బీజాక్షరము.
అం - వక్రవాక్యము, అతిదీర్ఘము, ఆజ్ఞ, దోసిలి,
సప్తస్వర కాలపరిణామము, పరమాత్మ,
కారణము, కక్ష్య, అంతపురము, గౌరవము.
అ: - సిగ, సిద్ధమంత్రము, సూర్యరథాశ్వము, నిర్బంధము,
చక్రము, చంద్రబింబము, కోడితల, బ్రహ్మ, విష్ణువు,
మహేశ్వరుడు.
క - బ్రహ్మ, వాయువు, పరమాత్మ, అగ్ని, చిత్తము,
సూర్యుడు, బుద్ధి, యముడు, నెమలి, విష్ణువు,
సముద్ర వస్తువు, శ్వేత వర్ణం, సిగ్గు, తల, సుఖం,
ఏడాది, తెలుపు, అడవి, ఆశ్చర్యం, పసుపు, నీరు.
క: - విష్ణువు, చతుర్ముఖుడు, మన్మథుడు, అగ్ని, వాయువు,
సూర్యుడు, యముడు, దక్షుడు, పక్షి, మేను, ఆత్మ,
ధ్వని, బుద్ధి, నెమిలి,కాంతి, కాలము, ముడి, రాజు
కం - నీరు, సుఖము, శిరసు, బ్రహ్మము.
కిం - ఏమని అడుగుట, నింద, ఆక్షేపణ, సందేహం,
వికల్పం, దూఱు, నీతి, అడుగు.
కట్ - పోవు, కప్పివేయు, ప్రకాశించు, చూపు,
ప్రదర్శించు, అవతరించు
కంఠ్ - దుఃఖించు, పోగొట్టుకొను,
తీవ్రముగా కోరు, గుర్తించు
కత్థ్ - పొగడుకొను, స్తోత్రముచేయు
కథ్ - చెప్పుట, వెల్లడిచేయుట, మాటలాడుట,
తెలుపుట, చూపుట, వివరించుట
కర్ణ్ - చీల్చుట, విసిగించుట, వినుట
కల్ - లెక్కించు, ధ్వనించు, భరించు, మోయు,
తీసుకొను, తెలిసికొను, ఆలోచించు,
అనుభవించు, అనుషించిపోవు, ఆధారపడు
కవ్ - స్తోత్రముచేయుట, వర్ణించుట, రచించుట, చిత్రించుట.
కష్ - రాయుట, పరీక్షించుట, ప్రయత్నించుట,
ఒరిపిడి రాతిపై గీయుట
కస్ - కదలు, పోవు, చేరు, తొలగించు
కమ్ - కోరుట
కా - ఎవతె
కాశ్ - ప్రకాశించు, అగపడు
కాస్ - ప్రకాశించున దగుట
కి - జ్ఞానం, ఎఱుంగుట.
కిం - , ఏమి, ఎవడు, ఎవతె, ఏది
కిః - పక్షి
కీ - నింద
కు - భూమి, కుత్సిత పాపము, కొంచెము, నివారించుట,
నింద, రాయి, షష్ఠీ విభక్తి ప్రత్యయము.అల్పుడు,
పాపము, నివారించిట, నిందితము
కుః - భూమి, ఒకటి, కల్లు, హీనుడు,
దుర్మార్గుడు, విరక్తి
కుచ్ - పక్షివలె అరచుట, పోవుట, వంగుట
కుట్ట్ - ముక్కలుచేయు, పిండిచేయు,
నిందించు, గుణించు
కుత్స్ - నిందించు
కుప్ - కోపించుట, ఉద్రేకించుట,
బలమునొందుట
కూ - ధ్వనిచేయుట, కలవర మొనర్చుట,
ఆక్రందించుట
కూ: - పిశాచి.
కూజ్ - అస్పష్టముగా ధ్వనిచేయుట
కృ - దెబ్బ కొట్టుట, చేయుట, నిర్మించుట,
రచించుట, అగుట, ఆచరించుట
కృత్ - చేయువాడు, ముక్కలుచేయుట,
ముక్కలుచేసి విసరివేయుట, నాశము చేయుట
కృశ్ - క్షీణించుట, దుర్బలుడగుట
కౄ - విసరుట, వెదజల్లుట, నింపుట
కౄత్ - చెప్పుట, పిలుచుట, స్తోత్రముచేయుట
క్ఌప్ - తగియుండుట, ప్రకాశింపజేయుట, ఉత్పత్తిచేయుట,
సఫలుడగుట, స్థిరపరచుట, పంచుట, ఆలోచనచేయుట
క్రమ్ - పోవుట, నడచుట, సమీపించుట, దాటిపోవు, ఎక్కు,
అతిక్రమించు, అతిశయించు.
కృప్ - సమర్థుడగుట
కమ్ - కోరుట
కృష్ - దున్నుట
కౌ - భూమియందు, వీరిద్దరెవరు(అనుట)
క్రా: - ఆక్రమించువాడు.
క్రీ: - కొనివాడు.
క్రీ - కాలికా, బీజము.
క్రోం - అంకుశ బీజము.
క్రౌమ్ - అంకుశ బీజము.
క్లీం - జగన్మోహన(కామ)బీజము.
క్ష - అడ్డగించుట, విరోధము, క్షేమము,
దుస్స్వప్నము, క్షత్రియుడు, రక్కసుడు.
క్షః - నాశము, అదర్శనము, లోపము, మేఱుపు
క్షేత్రము, వక్షస్స్థలము, వ్యాకరణశాస్త్రము.
క్షం - పొలము, రక్కసుడు.
క్షణ్ - దెబ్బకొట్టు, గాయపరచు, చీల్చు, ముక్కలు చేయు
క్షప్ - ఉపవసించు
క్షమ్ - అనుమతించు, క్షమించు, సహించు
క్షర్ - ప్రవహించు, కాఱు, బొట్టుబొట్టుగా పడు,
నశించు, వ్యర్థమగు
క్షల్ - కడుగు, పవిత్రముచేయు, శుభ్రముచేయు, తుడిచివేయు
క్షా - ఓర్పు, నిద్ర
క్షి - నశించు, పరిపాలించు, నాశముచేయు, చెడగొట్టు,
చంపు, గాయపరచు
క్షి: - క్షేత్రము, క్షాత్రసంరక్షణము, నరసింహస్వామి.
క్షిష్ - విసరువేయు, వంపుపోనిచ్చు, పెట్టు, నిరాకరించు,
అవమానపరచు, నిందించు
క్షివ్ - మత్తెక్కు, ఉమ్మివేయు
క్షు - తుమ్ము, దగ్గు
క్షుత్ - తుమ్ము, ఆకలి
క్షుధ్ - ఆకలిగొను, తుమ్ము
క్షుభ్ - కదలు, వణకు, కలతజెందు
క్షుర్ - నఱకు, కోయు
క్షై - క్షీణించు, నశించు, కృశించు
క్ష్మా - భూమి
ఖ - గరుత్మంతుడు, స్వర్గము,కత్తి, శాంతము,
ఈచఁబోయిన కాలుసేతులు కలవాడు.
బంగారు, మణి, కొంచెము, దీనుడు,
సున్న, దవాగ్ని, నిశ్చయము.
ఖం - ఇంద్రుయము, ఆకాశము, స్వర్గము, సుఖము,
నక్షత్రము, వరిమడి, పట్టణము, దయ, పలక,
అభావము, గురుతైన బిందువు, ఉంచుట, రంధ్రము.
ఖః - సామాన్యమైనది, అభావము.
ఖ్యా - ప్రసిద్ధి చెప్పుట.
గ - వినాయకుడు, గంధర్వుడు, గానము, సంతోషవాక్యము.
గః - గంధర్వుడు, గణపతి, గుర్వక్షరము, ఒక స్వరము,
గానము, గమయిత, గాయకుడు.
గా - పూర్వకథ, శ్లోకం, స్తుతి.
గీః - వాక్కు, స్తుతి.
గు - మలవిసర్జనము.
గుః - విజ్ఞానము, చీకటి.
గూః - మలము
గృ - తడుపుట, ఎఁఱుగుట, విన్నపము.
గౄ - ధ్వనించుట, మించుట.
గో - యాగము, వృషభము, చంద్రుడు, వాక్కు, భూమి,
దిక్కు, గోవు, కిరణము, బాణము, నేత్రము, స్వర్గము,
వజ్రాయుధము, జలము, రోమము, సరస్వతి, గుఱి,
సూర్యుడు.
గౌః - కిరణము, గోమేధికము, వజ్రము, వజ్రాయుధము,
చంద్రుడు, సూర్యుడు, గోవు, ఇంద్రియము, కన్ను,
తల్లి, బాణము, తొమ్మిది, జలము, వాక్కు, వెంట్రుక,
భూమి.
గ్మా - భూమి
గ్లై - సంతోషహాని, బడలిక.
గ్లౌః - చంద్రుడు, కర్పూరము.
గ్లౌమ్ - భూబీజము.
ఘ - మేఘము, వేడిమి, చిఱుగంట, ఘంట,
సంఘటనము, శివుడు, గుడ్లగూబ, వాద్యము,
అమృతము, నేల, గొల్లపల్లె, అమ్ము, భయంకరము,
ఒరుయుట.
ఘం - వాద్యము, అమృతము, భూమి, లోక వృత్తాంతము,
భయంకరము, స్తంభనకర సౌభాగ్య బీజాక్షరము.
ఘః - మేఘము, చిఱుగంటలు, సంహారము,
వేడిమి, ఘర్ఘర ధ్వని, లఘువు.
ఘా - దెబ్బ, స్త్రీల కంఠ్యాభరణము
ఘుః - పందిముట్టె
ఘూః - ధ్వని
ఘుమ్ - అవ్యక్తధ్వని బీజము
ఘ్నీమ్ - శంఘ్ని శాలికాశ్యాలా శాద్వలా
శుష్కలా అను బీజపంచకము.
ఙ - భైరవుడు, కాటుక, విషయము,
విషయేచ్ఛ, వేణునాదము
ఙమ్ - కాటుక, భయంకరము, దేశము, జనము,
శివుడు, మాట, విషయవాంఛ
చ - తురుష్కుడు, చోరుడు, ధ్వని, చంద్రుడు, చకోరపక్షి,
చామరము, సముచ్ఛయార్థము, అతిశయము, ఆజ్ఞ, దీప్తి,
శివుడు, సూర్యుడు.
చమ్ - అభిచారమును పోగొట్టు ఒక క్రూరబీజము.
ఛ - కోరిక, కప్పుట, సంవత్సరము, వెలుగు,
స్వచ్ఛమైనది, నిత్యమైనది, మలినమైనది,
వేరైనది, కంచె, బరిణె, నిర్మలము.
ఛః - నాయకమణి, కోయవాడు.
ఛమ్ - భూతములను పారద్రోలెడు,
భీకర రక్తదంష్ట్ర బీజవిశేషము.
ఛాః - భేదయిత, పాదరసము.
జః - విష్ణవు, విప్రుడు, జగణము, జన్మ, ముక్తి, తండ్రి,
పిశాచము, తేజస్సు, విషము, జాతుడు, జేత,
వేగము కలవాడు.
జ - జపము, జయశీలుడౌ పురుషుడు, ధ్వని, మేరువు, మత్సరము,
శివుడు, విష్ణవు, గాయకుడు, నీరు, గంగ, నగ, భార్య,
దేవసేన, యోని, సముద్రపుటొడ్డు.
జం - కటి ప్రదేశము, భూషణము,
భార్య, తేజము, ఉదకము, జననము.
జమ్ - పనులను జెరచునది, తిరస్కరింపరానిదగు ఒక బీజాక్షరం.
జుః - కీర్తి, యుద్ధము, జీర్ణించుట, బృహస్పతి, ఆకాశము, పిశాచము.
జూః - సరస్వతి, ఆకాశము, స్త్రీ భూతము, వేగము.
జ్యా - వింటినారి, తల్లి, భూమి.
ఝ - బ్రహ్మ, అందె, పరాక్రమము, భ్రమణము, నాశము,
చోరుడు, ఝంఝామారుతము, మదము, ధ్వని,
గాలివాన, నశించునది, అలంకారము.
ఝమ్ - భూతనాశకబీజము, నర్తకబీజము, ఇచ్ఛాబీజము.
ఞ - సమూహము, దేశము, గర్వము, గంధలేపనము, శిరస్సు,
గాడిదె కూత, ఊర్ధ్వముఖమైనది, మూఢరూపమైనది,
భయము, కీర్తి, గాయకుడు, జనపదము, పద్యము,
వాయుభేదము, ఝర్ఝరమను ధ్వని.
జ్ఞ - విద్వాంసుడు, బ్రహ్మ, బుధుడు.
ట - భూమి వడగండ్లు, ధ్వని, తలుపు, విల్లు, పొగ, కాకి,
సూర్యకిరణం, నీటిసుడి, పుత్రుడు, ఉత్పత్తి, ఆవృత్తి,
చమరీమృగము, పలుమార్లు పలకడం.
టః -కొట్టునట్టివాడు, పాదము, ధ్వని
టం - టంకారము, సర్వవ్యాధి హరబీజము,
షణ్ముఖ బీజము, స్వనబీజము.
టా - భూమి.
ఠ - పిల్లన గ్రోవి, ధ్వని, కట్టుట, దృఢము, అగ్ని
ఠః - శివుడు, ఠమ్మను చప్పుడు, చంద్రమండలము, విషయము,
బిందువు, సాహసము, జనులగుంపు, మూర్ఖుడు, శూన్యము.
ఠమ్ - చంద్రబీజము, ధ్వనిబీజము, పద్మబీజము.
డ - దేశము, శంభుడు, చిఱునగవు, భయము, నాశము,
జయధ్వని, శంఖధ్వని, రౌద్రరసము, సిగ్గు, వాక్కు,
డామరవాద్యము, దుర్గమ స్థలము, వస్త్రము,
డమరుకవాద్యము, ఆందోళనము, గాయకుడు, జడుడు.
డమ్ - విషహరమగు ఒక బీజము, గరుడ బీజము,
రేణుకా బీజము, అంజనీబీజము, అందలము,
గాయకుడు.
డా - డాకిని.
ఢ - పిశాచము, భయము, కాలము, ప్రేమ, మార్గస్థుడు,
ధ్వని, జయభేరి, పోలిక, జ్ఞానము, వాద్యము, గుణహీనుడు,
దాగినవాడు, సాధువు, ఎడమ కుడి పిక్కలు, కొడుకు.
ఢః - ఢక్క, కుక్క, కుక్కతోక, ధ్వని, నిర్గుణము.
ఢమ్ - సకల సంపత్ప్రదమగు ఒక బీజము,
వాయుబీజము, బాణ బీజము.
ణ - జారుడు, భయంకరుడు, కంటకము,
ధ్వని, గగుర్పాటు, శూరుడు, కాపాడుట, ముల్లు.
ణః - వరహము, నగ, సత్యము, చలిపందిరి, బిందుదేవుడు,
గుణరహితుడు, నిర్ణయము,
ణా - గోవు,రాత్రి, పాన్పు, ముక్కు,
దయ, తామరరేకు, జ్ఞానము
ణ్యః / ణ్యం - బ్రహ్మలోకమునందలి ఒక పెద్ద సరస్సు.
త - సంభోగము, నిశ్చయము, కోపము, తోక, రసవాదము,
చోరుడు, దయ, ఆడుట, కారణము.
తః - మణి, నవ్వు, చూలు, ఓర్పు, అమృతము, బుద్ధుడు,
యువకుడు, మోసము, మ్లేచ్ఛుడు, దొంగ, పందితోక
తత్ - ప్రస్తుతార్థము, హేతువు,
వేతనములేక పనిచేయువాడు.
తమ్ - ఆలయము, బాధనొందు,
ధనధాన్యములనొసగు బీజాక్షరము,
తమోబీజము.
తప్ - ప్రకాశించు, వెచ్చగానుండు, బాధసహించు,
శరీరమును కృశింపచేయు, తగులబడు.
తా - పుణ్యము
తు - పాదపూరణము, విశేషము,
ఏకక్రియాన్వయము, నిశ్చయము
తృష్ - దప్పిక, తీవ్రమగు కోరిక.
తే - పార్వతి
తేః - క్రీడించు, క్రీడించువాడు, నది, భయమును పోగొట్టుట,
నలుపు, తెలుపు, లావు
త్యజ్ - విడిచిపెట్టు, వదిలించుకొను
త్వచ్ - తోలు, వల్కలము, ఆవరణము, స్పర్శేంద్రియము.
త్వమ్ - నీవు
త్వట్ - కాంతి, అగ్నిజ్వాల, వెలుగు.
త్రుట్ - తెగుట, చిరుగుట.
త్రై - కాపాడు, రక్షించు.
థః - కొండ, నీతినికాపాడుట.
ద - దాత, భేదించుట, ఓర్పు, దానము, పానము, వైరాగ్యము,
భార్య, చూపు, మూగ, పట్టుబడినది, పరిశుద్ధుడు, దావకము,
శుచి, శివుడు, గురుడు, త్రాగుట, పిలుపు.
దః - దయ, దానము, దమము, దాత ,దత్తము, ఖండనము,
భార్య, ఆకాశము,ఖండనము, ఇచ్చుట.
దమ్ - భార్య, పుష్టి, వృద్ధులు, కలిగించు, సుందర బీజాక్షరము,
శాంతించుట, అడ్డగించుట, వశపరచుకొనుట.
దల్ - ముక్కలగుట, వికసించుట.
దా - ఖండనము, రక్షణము, శోధనము,
దళము, దానము, రోగము.
దాన్ - ఇచ్చుట
దామ్ - దత్తాత్రేయ బీజము.
దుర్ - అమంగళము, దుఃఖము.
దృక్ - దర్శనము, జ్ఞానము, నేత్రము, చూచువాడు.
దృశ్ - చూచు, వెదకు, నిశ్చయించు.
ద్యు - దినము. ఆకాశము, ప్రకాశము,
స్వరము, అగ్ని.
ద్యుత్ - ప్రకాశించు, వెలుగు.
ద్మా - ధ్వనించుట, అగ్నితో కలియుట
ధృ - ధరించుట, పట్టుకొనుట
ధ్యై - ధ్యానించుట
ధ - ఇంద్రుడు, ధ్వని, ధాన్యము, కుబేరుడు,
ధన్వంతరి, కడవ, గృహము, ధనము.
ధం - ధనము, ధనికుడు.
ధః - బ్రహ్మదేవుడు, మనువు
ధా / ధిః, / ధీః - బుద్ధి
ధిక్ - ధక్కారము, నింద.
ధూః - బరువు, ధనము, వణకుట,
కదలుట, కలతజెందుట.
ధ్మా - ఊదుట, నిస్వనించుట, నిప్పుమండునట్లుచేయుట.
న - వినాయకుడు, నాభి, జ్ఞానము, వాద్యము, గొడ్రాలు,
సూక్ష్మమైనది, మిగుల కష్టమైనది, శూన్యమైనది, భేదమైనది,
దానము, మేలు, అభావార్థము.
నః - అధిపతి, పడవ, బౌద్ధశాస్త్రవేత్త, బుద్ధుడు, స్తోత్రము,
వృక్షము, స్వాగతము, చుట్టము, చెట్టు, సూర్యుడు,
బంగారము, బంధము, రత్నము.
నా - మోడు, వరుడు, మగవాడు, నాయకుడు, నిషేధము.
ని - బెదిరించు, మత్సరము, వంగుట, మిక్కలి, స్వరము.
నిర్ - నిషేధము, నిశ్చయము.
నీ - తీసుకొని పోవుట, తెచ్చుట, చేర్చుట.
ను - నుతి
నుద్ - ప్రేరణ, ప్రోత్సహించుట, తొలగించుట.
నౌః - ఓడ, కాలము, నవ్వు
న - నిషేధించుట, సామ్యము
ని - గృహము, మిక్కిలి, క్రిందగుట, ఉంచుట, రాశి,
ఆధారము, కట్టుట, మోక్షము, దానము, చూచుట,
అణగుట, సమీపము, నేర్పు, చాలించుట, శాశ్వతము,
సందేహము, నింద
ను - ప్రశ్న, సంశయార్థము, గడచినది, ఊఱట, ఊహ,
అవమానము, మిష, అవాంతరార్థకల్పన, అతిక్రమించు,
అడుగుట
నఞ్ - లేదు అడ్డగింత, స్వరూపము, అతిక్రమము,
కొంచెము, సామ్యము, విరోధము, ఇతరము
నభ్ - చంపుట
నమ్ - వంకరతిరుగుట, వంగుట, శబ్దము చేయుట
నయ్ - తీసుకొని వచ్చుట
ప - వాయువు, పర్వతము, ప్రకాశము, కౌస్తుభము,
క్షణము, శుభలగ్నము.
పమ్ - బంగారము, పానముచేయువాడు, నీటిధార,
సమ్మతి, ఆపన్నుడు, కోపశూన్యుడు.
పః - పరమాత్మ, పానము, పవనము, పతనము, పవిత్రము,
పాపనాశకరము, పంచమస్వరస్థానము, కుబేరుడు,
పడమటి దిక్కు, పాలించివాడు.
పాః - పాలనకర్త, పవిత్రము, పూరితము, బూరుగుచెట్టు,
తీగసంకెల, నిర్మలమైనది.
పా - రక్షించుట, త్రాగుట, పీల్చుట.
పుం - పురుషుడు, పరమాత్మ.
పూ - పూవు, శిద్ధి, పవిత్రము.
పూర్ - పురము, శరీరము, పూరించుట.
పణ్ - వ్యవహారము చేయుట, స్తోత్రము చేయుట.
పత్ - పడుట, దిగుట, క్రిందికి వచ్చు, ఎగురుట.
పద్ - పాదము, అడుగు, నాల్గవభాగము.
ప్ర - ప్రాధాన్యము, అతిశయించుట.
ప్లు - ఈదుట, తేలుట, నావచే దాటుట, ఎగురుట, జారుట.
ఫ - గాలితోకూడిన వాన, భుజమును తట్టుట, ఫూత్కారము,
నివారించుట, యుద్ధము. పిలుచుట
ఫః - అభివృద్ధి, కఠినోక్తి, నిరర్థక సంభాషణ,
వాతము, కఫము, విస్తారమైన, మరుగైన.
ఫాః - వృద్ధి, వర్ధకము, సంతాపము, వ్యర్థవాక్యము.
16వ భాగము, ఆట, గుడిసె.
బ - కుంభము, వరుణుడు, బిందువు, వికల్పము, గురువు,
మదము, సంపదలను కలుగజేయువాడు, కలహము,
పక్షము, గర్భము, పర్వతము.
బః - సంద్రము, జలము, వరుణడు, కడవయోని,
గొఱుగుట, గదాయుధము, పండు.
బమ్ - సకల దోషములను హరించు నొక ఊర్మి బీజాక్షరము.
బర్హ్ - పలుకు, ఇచ్చు, గాయపరచు, చంపు,
నాశనముచేయు, వ్యాపించు.
బా - బూరుగ, తీగె, సంకిళ్లు, స్వచ్ఛమైన.
బాధ్ - పీడించు, హింసించు, తొలగించు, గాయపరచు.
బృహ్ - పెరుగు వృద్ధినొందు, గర్జించు.
భ - శివుడు, తుమ్మెద, స్వభావము, శుక్రుడు, కిరణము,
మేఘము, భూమి, అలంకారము, ప్రకాశము.
భః - గ్రహము, భ్రాంతి, భగణము, భవనము, గృహము,
భార్గవుడు, భూధరము, భృంగము.
భక్ష్ - తినుట, మ్రింగుట, జీర్ణించుకొనుట, ఉపయోగించుట.
భజ్ - పంచుట, నిర్దేశించుట, అనుభవించుట,
అభ్యసించుట, సేవించుట, గౌరవించుట.
భంజ్ - ముక్కలుగ చేయుట, చెడగొట్టుట, ఓడించుట.
భష్ - మొరుగుట.
భమ్ - నక్షత్రము, (మేషాది)రాశి, సమస్త భూతోచ్ఛాటన
చేయునట్టి భీకర బీజాక్షరము.
భాః - సాధనము, కాంతి, ఆకాశము, రాశి, నక్షత్రము,
త్రిపుండ్రము, ఊర్థ్వ పుండ్రము, చక్రము.
భాష్ - మాట్లాడుట.
భాస్ - ప్రకాశించుట.
భిః - గోడ, పక్షి, భయము.
భిక్ష్ - యాచించుట.
భీః - భయము
భుః - శివుడు, బ్రహ్మ, చంద్రుడు.
భూ - అగుట, పుట్టుట, వెలువడుట, ఉండుట,
జీవించి ఉండుట, నిలుచుట.
భూః - భూమి, ఉనికి, చోటు, ఒకటి.
భూష్ - అలంకరిచుట
భృ - భరించుట, మోయుట.
భోః - ఆహ్వానము, సంబోధనము.
భ్రమ్ - ఇటు నటు తిరుగుట.
భ్రాజ్ - ప్రకాశించుట.
మః - మగణము, బంధనము, పచ్చవన్నె, గోరోజనము
వంటి వర్ణము, బ్రహ్మ, విష్ణువు, శివుడు, యముడు,
వేళ, విషము, మంత్రము, చంద్రుడు.
మండ్ - అలంకరించు
మద్ - మత్తిల్లుట, పిచ్చివాడగుట,
సంతోషించుట, ఆపదనొందుట.
మన్ - గర్వించిట, పూజించుట, విశ్వసించుట, కల్పించుట,
ఆదరించుట, తెలిసికొనుట, స్వీకరించుట, కోరుట,
మనస్సు లగ్నంచేయుట.
మన్ద్ - ప్రసన్నుడగుట, శిధిలమగు, ప్రకాశించుట,
మెల్లమెల్లగా పోవుట, తిరుగుట.
మహ్ - ఆదరించుట, సమ్మానముచేయుట,
వికసించుట, వృద్ధినొందుట.
మమ్ - శత్రువులను ముగ్ధులను చేసే ఒక బీజాక్షరము,
భేకీబీజము, శిలీబీజము
మా - ప్రమాణము, మరణము, సముద్రపుటొడ్డు, ధారణగల బుద్ధి,
లక్ష్మీదేవి, మధ్యప్రదేశము, తల్లి, నిషేధము, జనము
మార్గ్ - ప్రార్థించుట, వెదకుట, అలరించుట, పోవుట.
మార్జ్ - పరిశుద్ధము చేయుట.
మాస్ - చంద్రుడు, మాసము.
మిథ్ - సహకారి అగుట, ఒక్కచో కలియుట,
మైధున మొనర్చుట, గాయముకలిగించుట,
దెబ్బతీయుట.
మిల్ - కలియుట, చేరుట.
మిశ్ర్ - కలుపుట.
మిష్ - కన్నుతెఱచుట, చూచుట.
మిహ్ - తడుపుట, మూత్రవిసర్జనము,
వీర్య పాతము చేయుట.
మీ - పోవుట, నశించుట, తెలిసికొనుట, చచ్చుట,
(చంపుట, నాశనముచేయుట) తగ్గించుట,
మార్చుట, మీరుట.
మీల్ - (కండ్లు)మూయుట, ముడుచుకొనుట,
కలియుట, మూసుకొనుట.
ముచ్ - మోసముచేయుట, వదులు చేయుట, విడిచిపెట్టుట,
స్వతంత్రము చేయుట(ఇచ్చుట).
ముండ్ - (తల)గొరుగుట, మునుగుట.
ముద్ - ఆనందము, సంతోషము, ప్రసన్నుడగుట.
ముర్చ్ - గాఢమగుట, కూడుట, మూర్ఛిల్లుట, పెరుగుట,
లావగుట, ప్రభావము చూపుట, నిండుట, వ్యాపించుట.
ముష్ - దొంగిలించుట, తీసికొనుట.
ముహ్ - పరవశించుట, మూర్ఛిల్లుట, మూఢుడగుట.
మృ - మరణించుట, నశించుట.
మృగ్ - వెదకుట, ప్రత్నించుట, అనుసరించుట.
మృజ్ - శబ్దము చేయుట, శుద్ధిచేయుట, అలంకరించుట.
మృద్ - త్రొక్కుట, అడచుట, చంపుట,
హింసించుట, జయించుట.
మట్టి, ఎర్రమన్ను.
మృశ్ - తాకుట, పట్టుకొనుట, ఆలోచించుట.
మృష్ - వెదజల్లుట, సహించుట,
అనుభవించుట, క్షమించుట.
మే - మార్చుకొనుట.
మేధ్ - కలియుట, ఒండొరులు కలిసికొనుట. తెలిసికొనుట,
దెబ్బతీయుట, చంపుట.
మోక్ష్ - విడచుట, స్వతంత్రునిచేయుట.
మ్నా - మరలమరల చెప్పుట, వల్లించుట,
స్మరించుట, తలంచుట, ఆలోచించుట.
మ్లై - వాడిపోవుట, అలసటనొందుట, నిరుత్సాహమునొందుట.
యః - కీర్తి, ప్రయాణము, వాయువు, త్యాగము, పోవువాడు,
స్థానము, యోగము, యముడు, దాత, మగణము.
యమ్ - సర్వవ్యాపకమగు ఒక పవిత్రబీజాక్షరము, వాయుబీజము,
వశ్యబీజము, వీరబీజము, యత్నము, యమున.
యజ్ - యాగముచేయుట, ఆహుతులిచ్చుట, పూజించుట.
యత్ - సర్వనామము, అవ్యయము, హేతువు, ప్రయత్నించుట.
యద్ - ఎవడు, ఎవతె, ఏది.
యన్త్ర్ - నిలువుట, అడ్డుకొను.
యా - కీర్తి, యానము, వాహనము, పూలగుత్తి, కాంతి, లక్ష్మి,
నిర్మాణము, ప్రాప్తి, త్యాగము, పోవుట.
యాచ్ - కోరుట, అడుగుట.
యు - కలియుట, వేరువేరుగా చేయుట.
యుజ్ - కలియుట, అనురక్తుడగుట, చేరుట, ప్రయోగించుట,
నియోగించుట, కలుపుట, కలిసినవాడు.
యుధ్ - పోరు(సంగ్రామము), యుద్ధము చేయుట,
సంఘర్ష మొనర్చు.
ర - అగ్ని, మన్మథుడు, నాశనము,
వజ్రము, హస్తము, ఋతువు.
రం - నెత్తురు, శిరస్సు, ధ్యానము, ఆకాశము,
గ్రుడ్డు,కడుపు, ముఖము, భయము,
విరసము, త్యాగము, రసహీనమైనది, తీక్షణము.
రః - రాముడు, వాయువు, అగ్ని, భూమి,
ధనము, ఇంద్రియము, ధనాటంకము.
రంహ్ - కలిసిపోవుట, వేగముగా పోవుట.
రక్ష్ - కాపాడుట, రాజ్యము చేయుట, పొదుపుచేయుట.
రచ్ - రచించుట, సిద్ధము చేయుట,
వ్రాయుట, అలంకరించుట.
రంజ్ - సంతోష పెట్టుట, ఎఱ్ఱనగుట,
అనురక్తుడగుట, ప్రసన్నుడగుట.
రట్ - అఱచుట, ఆక్రందించుట.
రణ్ - ధ్వనిచేయుట.
రద్ - ముక్కలు చేయుట, చీల్చుట.
రధ్ - గాయపరచుట, బాధకలిగించుట.
రభ్ - ఆరంభించుట, తొందరపడుట.
రమ్ - ప్రసన్నుడగుట, సంతుష్టుడగుట, ఆడుట,
సంభోగము చేయుట, ఉండుట.
రయ్ - పోవుట.
రస్ - ధ్వనించుట, కూయుట,
శబ్దము చేయుట, రుచిచూచుట.
రహ్ - విడచుట, త్యాగము చేయుట.
రా - బంగారము, మబ్బు, ధ్వని, శాల, చెప్పుట,
నడచుట, ఇచ్చుట, గ్రహించుట, సమర్పించుట.
రాః - ముద్రాంకితమైన ధనము, పసిడి.
రాజ్ - రాజు, ప్రకాశించుట, మెఱయుట,
సుందరముగా అగుపడుట.
రి - స్రావము, నాళము, అగ్నిబీజము.
రిః - స్రవించుట, క్షమించుట.
రిచ్ - శూన్యము చేయుట, శుభ్రము చేయుట,
పోగొట్టుట, విడగొట్టుట.
రుః - భయము.
రుచ్ - ప్రకాశించుట, ఇష్టమగుట.
రుజ్ - ముక్కలు చేయుట, నాశము చేయుట, బాధకలిగించుట,
పీడించుట, రోగగ్రస్తుని చేయుట,వంగుట, విరుగుట,
రుఢ్ - రాగము, అగ్నిజ్వాల, ఇచ్ఛ, కాంతి.
యుద్ధము, భయము, ధ్వని.
రుద్ - ఏడ్చు, దుఃఖము, కన్నీరు కార్చు.
రుధ్ - అడ్డగించు, నిలుపు, ఎదిరించు, నిరోధించు,
నిలువచేయు, మూయు, కట్టివేయు.
రుశ్ - గాయపరచు, చంపు, నాశముచేయు.
రుష్ - కోపించుట, కలతనొందుట, గాయపరచుట, చంపుట,
బాధించుట, రోషము, కోపము.
రుహ్ - మొలకెత్తుట, పెరుగుట, ఎక్కుట.
రూ - యువతి, చెదలు, బంగారము, కామరూపి.
రుక్ - రోషము, అగ్నిజ్వాల, ఇచ్ఛ, కాంతి,
యుద్ధము, భయము,ధ్వని.
రూష్ - అలంకరించు, పూయు.
రై - ధనము, శబ్దముచేయుట.
ల - ఖండింపబడునది, గ్రహించుట,
చంద్రుడు, లవణము.
లమ్ - విశ్వమును భరించునట్టి ఒక ప్రకాశబీజాక్షరము.
లః - కాంతి, ఆకాశము, భూమి, భయము, సంతోషము,
గాలి, లవణము, దానము, ఆలింగనము, తలపు,
ప్రళయము, సాధనము, మనస్సు, వరుణుడు, లీనము,
లఘువు, ఓదార్చుట.
లక్ష్ - చూచుట, గురిపెట్టుట, స్పష్టముచేయుట.
లగ్ - తగులుకొనుట, అంటుకొనుట, కలియుట.
లంఘ్ - దూకుట, ఎక్కుట, ఎగురుట, దాటుట,
అనాదరించుట. నిలుపుట, ఆక్రమించుట,
ముందునకు చొచ్చుట, ఉపవాసముచేయుట.
లజ్ - సిగ్గుపడుట, కళంకితమొనర్చుట,
అగపడుట, ప్రకాశించుట, మూయుట.
లజ్జ్ - సిగ్గుపడుట.
లప్ - మాటలాడుట.
లంబ్ - వ్రేలాడుట, అంటుకొనుట, ఆశ్రయించుట,
విలంబముచేయుట, ధ్వనిచేయుట.
లభ్ - పొందు, సంపాదించు, పట్టుకొను,
తెలిసికొను, నేర్చుకొను.
లల్ - క్రీడించుట, ప్రేమతో చూచుట.
లష్ - కోరుట, ఇచ్చగించుట.
లస్ - ప్రకాశించుట, వెలుగొందుట, స్పటపడుట.
లస్జ్ - సిగ్గుపడుట.
లా - తీసుకొనుట, పొందుట.
లిఖ్ - వ్రాయుట, లిపిబద్ధముచేయుట, గీయుట, గీరుట.
లింప్ - పూయుట, మలినమొనర్చుట.
లిహ్ - నాకుట, నమలుట.
లీ - కఱగు, ద్రవించు, అనుసరించు, అంటుకొను,
పట్టుకొనియుండు, కౌగిలించుకొను, కఱగిపోవు,
అదృశ్యమగు.
లుంచ్ - కోయు, లాగు, చించు
లుఠ్ - పడగొట్టుట, నేలపై దొరలుట, బాధన నుభవించుట,
కదలుట, దొంగిలించు, దొరలుట.
లుడ్ - కల్లోలము చేయుట, కలియగలుపుట.
లుంట్ - పోవు, దొంగిలించు, కుంటివాడగు, సోమరియగు,
దోపిడీ చేయు, అనాదరము చేయు.
లుంఠ్ - పోవు, ఆందోళనచేయు, కుంటియగు,
నిష్క్రియుడగు, దోపిడీచేయు, అడగించు.
లుప్ - ఆశ్చర్యపడు, ఆశ్చర్యపరచు, కలవరపడప,
కలవరపెట్టు, త్రుంచుట, విఱచుట, కోయుట,
పాడుచేయుట, అపహరించుట, గుంజుకొనిపోవుట,
పట్టివేయుట, కప్పిపుచ్చుట.
లుభ్ - ఆసపడు, ఆతురతతో కోరు.
లుల్ - తిరుగు దొరలు, ఇటునటు ఊగిసలాడు,
కదలు, కలతనొందు, అణచు.
లేప్ - పోవు, కదలు, ప్రార్థించు
లోక్ - చూచు, వీక్షించు, ప్రదర్శించు,
తెలిసికొను, ప్రకాశించు, మాటలాడు.
లోచ్ - చూచు, ప్రదర్శించు, చూచి ఆలోచించు,
పలుకు, ప్రకాశించు.
లోడ్- మూర్ఖుడగు
ల్యం - లయము, నిలయము.
ల్హౌం - హయగ్తీవబీజము
వ - సాత్వికుడు, వాయువు, వరుణుడు, మన్మథుడు.
వమ్ - అమృత(జల-తరంగ - అభ్ర - ధరణీ - వరుణ)బీజము.
వః - వాయువు, సముద్రము, నమస్కారము, వసతి, వరుణుడు,
వరుణబీజము, భూబీజము, తమోబీజము.
వచ్ - పలుకు, చెప్పుట, వర్ణించుట.
వంచ్ - చేరుట, పోవుట, తిరుగుట, మోసగించుట.
వద్ - పలుకుట, తెలుపు.
వధ్ - చంపుట
వంద్ - నమస్కరించుట, స్తోత్రముచేయుట.
వప్ - విత్తుట, గొఱుగుట.
వమ్ - క్రక్కుట
వయ్ - నేయుట
వర్ - కోరుట
వల్ - తిరుగుట, పోవుట
వశ్ - కోరుట
వస్ - నివసించు, ఉండు.
వహ్ - మోయు, వీచు, ప్రవహించు, కొనిపోవు, ఓడ.
వా - వికల్పార్థము, ఉపమానార్థము, గాలి వీచుట.
వాచ్ - వాక్కు, సరస్వతి
వాంఛ్ - కోరుట
వార్ - నీరు
వి - నేత్రము, ఆకాశము, వాయువు, పరమాత్మ, పక్షి,
(నిషేధము, వేఱు, విశేషము)
విద్ - తెలిసికొనుట,పొందుట, ఉండుట, ఆలోచించుట.
వి - నేత్రము, ఆకాశము, వాయువు, పరమాత్మ,
పక్షి, (నిషేధము, వేఱు, విశేషము)
విట్ - వైశ్యుడు, జనుడు, పురీషము.
విశ్ - ప్రవేశించు, మనుష్యుడు.
విష్ - తడుపుట, వ్యాపించుట.
వీ - పోవుట, కనుట.
వీజ్ - విసరుట, పోవుట.
వృ - వరించుట, పూజించుట, ఆవరించుట.
వృజ్ - విడచి పెట్టుట.
వృత్ - ఉండుట, వరించుట, ఇష్టపడుట.
వృధ్ - పెరుగుట.
వృష్ - కురియుట, వానపడుట, ఇచ్చుట.
వే - నేయుట, కుట్టుట.
వేప్ - వణకుట.
వేల్ల్ - కదలుట.
వ్యథ్ - భయపడు, దుఃఖించు, గుచ్చుట, కొట్టుట.
వ్రజ్ - పోవుట
శం - శివుడు, శాస్త్రము, శ్రేయస్సు, శుభము, కీర్తి,
ఇంద్రధనుస్సు, స్వర్గము, ఎదుటలేనివాడు.
శః - సీమ(హద్దు), శయనము, హింస, పుట్ట, తాబేలు,
రాజు, శిష్యుడు, న్యూనపరచు, శస్త్రము, శుభము.
శమ్ - సర్వఫలప్రదము సుఖదాయకము అగు బీజాక్షరము.
తగుట, అణగుట, సమృద్ధి.
శంస్ - ప్రశంసించుట, స్తోత్రము చేయుట, అంగీకరించుట.
శక్ - యోగ్యుడగుట, సమర్థుడగుట.
శంక్ - సందేహము
శప్ - శాపము పెట్టుట, నిందించుట.
శబ్ - శబ్దము
శా - దేవతాపూజ, శక్తి(సామర్థ్యము) శోభ, శ్రేష్ఠుడు, లక్ష్మి.
శాస్ - ఉదేశించు, పాలించు.
శి - శివుడు, శుభము, కాంతుడు, మోక్షము, హింస, నిద్ర.
శిక్ష్ - నేర్చుకొను.
శీ - నిద్రించు.
శుచ్ - నిరాశ, దుఃఖము.
శుధ్ - పరిశుద్ధముచేయుట.
శుభ్ - ప్రకాశించు
శుష్ - ఎండిపోవుట.
శ్రీ - ఐశ్వర్యము, సంపద, వృద్ధి, అలంకారము,
లక్ష్మి, సరస్వతి, పార్వతి, బుద్ధి, విషము,
సాలెపురుగు, ఒక రాగము, మారేడు చెట్టు,
మంగళప్రదము, లవంగము, చిల్లచెట్టు, కాంతి,
గౌరవార్థము కొన్నిపదాలకుముందు వచ్చునది.
శ్రు - వినుట.
శ్లథ్ - సడలుట
శ్లాఘ్ - పొగడుట, మెచ్చుకొనుట.
శ్లిష్ - కాల్చుట, కౌగిలించుకొనుట, కలియుట.
శ్వన్ - కుక్క
శ్వస్ - రేపు, గాలిపీల్చు, జీవించు.
ష - స్వర్గము, దేశము, లక్ష్మి, గర్భము, మోక్షము,
అవసానము, ఓర్చుట, పరోక్షము, శ్రేష్ఠము.
షః - స్వర్గము, కేశములు, పరోక్షము, శ్రేష్ఠము, నేర్పరి,
పండితుడు, తుది, నాశము, ముక్తి, కాన్పు, తెలిసినది,
గంభీర దృష్టిశాలి, ఉపద్రవము, ఎదురుగా.
షమ్ - ధర్మార్థ కామసిద్ధిదమగు ఒక పరిశుద్ధ బీజాక్షరము,
తడిద్భీజము, గర్భము, మోక్షము, తుద.
షట్ - ఆరు వస్తువులు
స - గౌరీపుత్రుడు, వాయువు, శరీరకాంతి, రథ మార్గము,
జ్ఞానము, ధాన్యము, నివారణము.
సః - ఏడు స్వరాలలో మొదటిది, సర్పస్థానము,
విఘ్నేశ్వరుడు, వాయువు, బుధుడు, ఈశ్వరుడు,
పాము, పక్షి, విష్ణువు, వాడు, సగణము, కోపము,
హంస బీజము, ప్రాకారము.
సమ్ - సుందరము, సమము, కలయిక, లెస్సగా,
మిక్కిలి, వృద్ధి, సముచ్ఛయము, సర్వకారణము,
సమస్త వర్ణాత్మకమగు ఒక బీజాైక్షరము, శక్త్యాత్మక
సుఖాత్మకబీజము, జ్ఞానము, ధ్యానము, భేధములేనిది.
సత్ - నక్షత్రము, బ్రహ్మ.
సన్ - కాలము, సత్యము, విద్వాంసుడు, శ్రేష్ఠుడు,
సత్పురుషుడు, పూజ్యుడు.
సహ్ - సహించుట, ఓర్చుట
సృ - పోవుట
సృజ్ - వదులు చేయుట, సృష్టించుట
స్మ - నిషేధము, స్మరణము, పాదపూరణము
స్వ - ధనము, జ్ఞాతి, తన సంబంధము,
సుఖము, కాంతి, చంద్రకాంతి,
తాను, స్వర్గము, పరలోకము
స్వర్ - స్వర్గము, పరలోకము, ఆకాశము
స్రక్ - పూలదండ
స్రజ్ - పూలమాల
స్రుచ్ - హోమము చేయు మిల్లిగంటె,
ఒక యజ్నోపకరణము
స్రాక్ - శీఘ్రముగా
సా - లక్ష్మి, పార్వతి, ప్రసిద్ధము
సాత్ - బ్రహ్మ
సిమ్ - అల్పము, సరస్వతి
స్విత్ - ప్రశ్న, వితర్కము
సిధ్ - పోవుట
స్నిహ్ - ప్రేమించుట, స్నేహముచేయుట
సు - పూజ, శ్రేష్ఠము, మంచి
స్ను - కొండ, నెత్తము
స్తు - పొగడుట
సూ - ప్రేరణ, ప్రసవము.
సూచ్ - చీల్చు, చూపు, సూచించు.
సూద్ - గాయచఱచుట, చంపుట
సే - సేవనము, సేవకుడు
సేవ్ - సేవించుట.
సో - పార్వతి
స్త్రీ - వనిత, బొమ్మ, చెముడు
స్థ - స్తలము
స్పంద్ - కదలుట, అదరుట
స్పర్ధ్ - పోటీపడు
స్పృశ్ - తాకుట, గ్రహించుట
షమ్/ షం - సస్యం, మధువు, ధారణ
సత్ - సత్యం, యజ్ఞం, సాధుభావం,
విష్ణు ప్రీతికరమైన కర్మ,
సద్భావం, మంచి
హ - శివుడు, విష్ణువు, హంస, యుద్ధము, గగుర్పాటు,
గుఱ్ఱము, గర్వము, వరుణుడు, పిలుపు(సంబోధనము),
ప్రసిద్ధి, పాదపూరణము, పూజ, వికారము, నింద,
చంపుట, ఆజ్ఞ, ప్రేరేపించుట, కోపము, ఏనుగు,
దివసము, వైద్యుడు, పృథ్వీ బీజము, ప్రాణవాయువు.
హమ్ - అస్త్రము, సుఖము, పరబ్రహ్మ, బాణము, మణికాంతి,
పిలుచుట, లేచుట, నవ్వుట, వీణాది సకల వాద్యధ్వని,
ఆకాశబీజము.
హస్ - నవ్వుట
హా - మనోవ్యథ, వగపు, నింద, బాధ,
పేడ, త్యాగము, నడుపు(గమనము), వీణ.
హి - ఆశ్చర్యము, వ్యధపడుట, పాదపూరణము, కారణము,
సంతోషము, విచారము, పద్యావరణము, నిశ్చయము,
అతిశయము, కారణవ్యాజము, తొట్రుపాటు, ఓర్వలేమి,
సర్పము, మృగము
హిం - ప్రశ్న, ఊహ
హీ - ఆశ్చర్యము, పిలుచుట, దుఖఃము,
వ్యాపారము, వినయము.
హ్లీం - మృద్భీజము
హు - సంతోషము, కోపము, విచారము, నహుషుడు
హుమ్ - ఉహా, భయము, ప్రశ్న, కోపము,
ఆమంత్రణము, వరాహ బీజము
హూః - విప్రుడు
హూమ్ - ప్రశ్న, సమ్మతి, కోపము,
భయము, నింద,
హృత్ - గుండెకాయ, మనస్సు
హే - ఓయి, కోపము, విచారము,
పిలుచుట, ద్వేషము మొ.
హై - ఓయి, సంబోధించుట, ఆహ్వానించుట.
హో - ఓయి, పిలుచుట
హౌ - ఓయి, పిలుచుట.
హ్యః - నిన్న
హ్రాం - సూర్యబీజము
హ్రీః - పార్వతి, శక్తి, సిగ్గు,
హ్రీం - మాయా(శక్తి)బీజము, బగళాబీజము, దేవీప్రణవం
హ్సౌం - ప్రాసాదబీజము
Source: https://sites.google.com/site/chitrasahiti/ekaksara-nighantuvu
Comments
Post a Comment