ఓం నమశ్శివాయ కాల గణన Dr visalakshi డా.విశాలాక్షి. సొమంచి(తంగిరాల)
ఓం నమశ్శివాయ కాల గణన
------------------------------------
అనుక్షణ పరివర్తన శీలి ప్రకృతి
ప్రతి క్షణం ప్రతి తృటి మార్పు మార్పు మార్పు!
అవిభాజ్యం కాలం
అయినా ప్రకృతి కాలాన్ని విభజించింది.
దాని ఫలితమే రాత్రింబగళ్లు, ఋతువులు , సంవత్సరాలు.
మనం కూడ విభజించాం కాలాన్ని
వారాలు, మాసాలు, భూతభవిష్యద్వర్తమాన కాలాలు.
భగవంతుని నిర్ణయం
ఎవరెవరు ఏ మతంలో ఏ సంప్రదాయం లో ఏ తల్లిదండ్రులకు పుట్టాలో
దానిని బట్టే ఉండాలి మన ప్రవర్తన! ఆలోచనాసరళీ!!
మానవులందరూ ఒక్కటేనన్నది సరియే! ఐనా ఎవరి బాధ్యత వారిదే! ఎవరి బంధం వారిదే! ఎవరి ధర్మం వారిదే! !
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః!!గీత!!
స్వధర్మాచరణలో మరణమైనా శ్రేష్ఠ మే పరుల ధర్మాన్ని ఆచరించడం కంటె!
హైందవులకు యుగాది -- ఉగాది -- చైత్రశుధ్ధ పాడ్యమి
ఋతుచక్రభ్రమణంలో ఒక ప్రారంభం. ఇది మారదు.
వసంతకాలం లో వచ్చే ' ఉగాది ' నుండే
చెట్టు చిగిర్చి శోభాయమానం
ప్రకృతి పరవశం ప్రారంభం.
ఆంగ్లేయులకు జనవరి నెల మొదటి రోజు సంవత్సర కాలమునకు ప్రారంభం.
మనకది మార్గశిరమో, పుష్యమో!
ఉద్యోగుల్లో ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు విద్యాసంవత్సరం - జూన్ నుంచి మార్చి - మన జ్యేష్ట మాసం మధ్య నుంచి చైత్రమాసం వరకు.
బ్యాంకు ఉద్యోగులకు - అదే మన ధన భద్రతాగారం - వారి లెక్కలు వేరే కదా!
ఇక ఇన్కంటాక్స్ - ఆదాయం పన్ను శాఖ అధికారులకు ఏప్రిల్ నుండి మార్చి కి లెక్క.
ఇంకా ఎన్నెన్ని దేశాలలో ఎన్నెన్ని పరిగణనలో!
వేడుక జరిపే నైజం ఉండాలి
వేలంవెర్రి పనికిరాదు.
పాశ్చాత్య వ్యామోహం పెచ్చు మీరిపోయి
మనవారల పుట్టిన రోజున, ఆంగ్లసంవత్సరం పుట్టిన రోజున, నిద్ర మానేసి, పసివారికి, వృధ్ధులకు నిద్రాభంగం కలిగిస్తూ
అర్ధరాత్రి పన్నెండింటికి
ఆర్భాటాలు, పలకరింపులు, కేకు కటింగులు, టపాసుల ప్రేలుళ్ళూ,
విదేశీయులకు మధ్యాహ్నకాలం మనవారికి అర్ధరాత్రి సమయం.
వారు హాయిగా మధ్యాహ్నం వేడుకలు జరుపుకుంటుంటే
పాశ్చాత్య వ్యామోహం తో మత్తెక్కిన పిచ్చి ప్రజలు
అర్ధరాత్రి నిద్ర మాని అంకమ్మశివాలులా చిందులేసే గెంతులాట
సిగ్గు చేటు ! నగుబాటు!!
మనకు పగలు సూర్యోదయం నుంచి ప్రారంభం
రోజు ప్రారంభం అప్పుడే !
అర్ధరాత్రి రోజు ప్రారంభం అవదు.
ఒద్దికగా బుధ్ధిగా మన పగలు మన పండగ లను అత్యంత వైభవంగా, సంస్కారవంతంగా జరుపుతూ ఇతరులను మనకిబ్బంది లేనట్లుగా అభినందించి కలసి మెలసి ఉత్సవాలతో ఆనందిస్తే
అది అభినందనీయం, ఆనందప్రదం .
జై హింద్.
--------------------
రచన:: డా.విశాలాక్షి.

Comments
Post a Comment