Christian pardon and apology:A psychic weapon that uses man's weaknesses. Author: Vadiyala Ranjith Kumar

క్రైస్తవ పాప క్షమాపణ – మనిషి బలహీనతలని ఉపయోగించుకొనే ఒక మానసిక ఆయుధం

రచన: వాడియాల రంజిత్ కుమార్

క్రైస్తవ మతానికి అజ్ఞానం, అజ్ఞానం తో కూడిన స్వార్ధం తప్పని సరి. అవి లేని నాడు క్రైస్తవం పేకమేడ లా కూలిపోతుంది. ఐరోపా లో ప్రస్తుతం మనం అదే చూస్తున్నాం. విద్యాభివృద్ది ఇంగిత జానం పెరగడం తో ప్రజలు క్రైస్తవం వదిలి నాస్తికులుగా మారుతున్నారు. హిందూ ధర్మ సిద్ధాంతాల వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారు. “స్పిరిట్యువల్ బట్ నాట్ రిలీజియస్” అనేది నిజానికి హిందావమే. ప్రస్తుతం కొన్ని లక్షల మంది తమని తాము “స్పిరిట్యువల్ బట్ నాట్ రిలీజియస్” అని పిలుచుకుంటున్నారు.

బైబిల్ మొదట్లోనే ఒక సంఘటన కనిపిస్తుంది. బైబిల్ దేవుడు ఆదాము, హవ్వాలని, సృష్టించి ఒక చెట్టుని చూపించి ఆ చెట్టుకి ఉన్న పళ్ళని మాత్రం తినద్దు అంటాడు. ఆ చెట్టు పేరు “మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము”. అంటే బైబిల్ దేవుడి ఉద్దేశం మనిషి ఎప్పటికీ ఇది మంచి ఇది చెడు అని తనకి తానూ తెలుసుకోకుండా అజ్ఞానం తో, మూర్ఖంగా బ్రతకాలి అని. అలానే క్రైస్తవం లో గొర్రె కి కూడా ప్రాధాన్యత ఎక్కువ. గొర్రె లక్షణం కూడా అదే. ముందున్న ఒక గొర్రె ని మనం ఒక వైపు తీసుకువెళితే దాని వెనకాలే మిగిలిన అన్ని గొర్రెలూ వచ్చేస్తాయి. అందుకే అజ్ఞానం తో ప్రవర్తించే మనుషులని కూడా గొర్రెల మంద తో పోల్చడం మనకి కనిపిస్తుంది. బైబిల్ చెప్పే ఎన్నో విషయాలు నమ్మడానికి అజ్ఞానం తప్పని సరి. అజ్ఞానం తో పాటు అజ్ఞానం తో కూడిన స్వార్ధం కూడా తప్పనిసరే.

కేవలం క్రైస్తవులు అన్న ఒకే ఒక్క కారణం వలన తమనందరినీ దేవుడు స్వర్గానికి పంపేస్తాడు అనేది క్రైస్తవుల ప్రధాన నమ్మకాలలో ఒకటి. దేవుడు పాప క్షమాపణ ఇవ్వగలడని, అలా చెయ్యాలి అంటే స్వయంగా తానూ ఏ పాపం చేసి ఉండకూడదు అని, యేసు ఏ పాపము అంటని పరిశుద్దుడని, అందువల్లనే అతని రక్తం ద్వారా మనుషులకి పాప క్షామాపన లభించిది అనేది క్రైస్తవుల నమ్మకం. సరళంగా చెప్పాలి అంటే నువ్వెన్ని పాపాలు చేసినా పర్లేదు, నువ్వు క్రైస్తవుడివి అయిపోతే నీకు స్వర్గమే. ఇదీ క్రైస్తవం చెప్పేది. ఈ అంశాన్ని కొంచెం ఆలోచిస్తే ఇటువంటి ఒక అసంబద్దమైన విషయం నమ్మడానికి స్వార్ధం తో కూడిన అజ్ఞానం ఎంత అవసరమో అర్ధం అవుతుంది.

ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీనిని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ 2012 లో జరిగిన నిర్భయ ఉదంతం గురించి బహుశా తెలియని వారు ఉండరు. రాక్షసుల లాంటి కొందరు దుర్మార్గులు నిర్భయ అనే ఒక అమ్మాయిని సామూహిక బలాత్కారం చెయ్యడమే కాక, అసలు ఊహించడానికే భయం కలిగే అంత దారుణంగా హింసించి చంపేశారు. నిర్భయ జనానంగం గుండా ఒక ఇనుప కడ్డీ ని దూర్చి ఆవిడ పేగులు బయటకు లాగారు అంటే ఇక వాళ్ళని మనం మనుషులు అని ఎలా అనగలం? అటువంటి ఒక స్థితి ప్రపంచంలో ఇక ఏ మనిషికీ రాకూడదు అని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కేసులో శిక్ష పడ్డ వారిలో ఒక్కడైన మొహమ్మద్ అఫ్రోజ్, నేరం చేసే నాటికి మైనర్ అవ్వడం వలన కేవలం 2 – 3 సం. ల సాధారణ జైలు శిక్ష అనుభవించి డిసెంబర్ 2016 లో విడుదల కూడా అయిపోయాడు.

ఇక విషయానికి వస్తే ఈ సంఘటనలో రెండు వర్గాలు ఉన్నాయి. నిర్భయ, ఆమె బందువులు, సన్నిహితులు, సానుభూతి పరులు ఒక వర్గం. ఆవిడ చావుకి కారణం అయిన మొహమ్మద్ అఫ్రోజ్, వాడి బంధువులు, వాడి సానుభూతి పరులు ఒక వర్గం. ఈ రెండు వర్గాల వారి పరంగా మనం క్రైస్తవాన్ని కనుక విస్లేషించినట్లైతే, “పాప క్షమాపణ” అనే ఈ క్రైస్తవ నమ్మకం గొప్పదా, నీచామైనదా అనేది మనం ఏ వర్గం వారిమి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది, అనే విషయం అర్ధమవుతుంది. మీరు కనుక నిర్భయ వర్గం అయితే ఈ “పాప క్షమాపణ” అత్యంత నీచంగా క్రూరంగా కనబడుతుంది. ఎందుకంటే ఇంత దారుణం చేసిన ఆ వెధవని, వాడు కనుక క్రైస్తవ మతం లోకి మారిపోతే దేవుడు క్షమించేస్తాడు పైగా స్వర్గానికి కూడా పంపుతాడు (కొంచెం అటు ఇటుగా ఇస్లాంది కూడా ఇదే నమ్మకం). నిర్భాయకి సంబంధించి ఇంత కన్నా దారుణం ఇంకోటి ఉంటుంది అనుకోని. ఒక్క సారి మీరు మిమ్మల్ని నిర్భయ అన్న గానో, తమ్ముడిగానో, తల్లి గానో, తండ్రి గానో ఊహించుకోండి, అప్పుడు స్వర్గం లో ఉన్న మొహమ్మద్ అఫ్రోజ్ ని గురించి ఆలోచించండి. ఇప్పుడు, కేవలం ఆయన స్థాపించిన మతంలో చేరిన కారణం గా అంత దుర్మార్గుడిని క్షమించేసి స్వర్గం ఇచ్చేసిన దేవుడుడిని గురించి ఆలోచించండి. దేవుడు అంటేనే అసహ్యం వెయ్యడం లేదు? వేస్తుంది. మనసున్న మనిషి ఎవ్వరికైనా అటువంటి దేవుడి మీద అసహ్యమే వేస్తుంది. అయితే ఇంత కన్నా ధారుణమైన విషయం ఏమిటంటే, నిర్భయ హిందువు కనుక బైబిల్ దేవుడు ఆవిడని మాత్రం శాస్వత నరకంలో పడేస్తాడు.

అయితే మొహమ్మద్ అఫ్రోజ్, అతని సానుభూతి పరులకి మాత్రం అటువంటి దేవుడు గొప్పగా నచ్చుతాడు. వాడు ఇంకో పది మానభంగాలు చేసి ఇంకో పది మంది అమ్మాయిలని చంపేసినా పర్లేదు వాడు క్రైస్తవుడు కాబట్టి వాడికొచ్చిన నష్టం ఏమీ లేదు. పైగా ఇక్కడి కన్నా ఎక్కువ సుఖాలు వాడికి బైబిల్ దేవుడు స్వర్గంలో ఇస్తాడు అదీ శాస్వతంగా. పైగా వాడు మానభంగం చేసి చంపేసిన అమ్మాయిలు హిందువులో, నాస్తికులో అయితే వాళ్ళని మాత్రం నరకానికి పంపేస్తాడు.

విషయం ఇంత స్పష్టంగా ఉంటే మరి ఇంతమంది క్రైస్తవులు ఎలా ఇటువంటి ఒక నీచమైన విషయాన్ని అంగీకరిస్తున్నారు అనే అనుమానం రావడం సహజం. క్రైస్తవులంతా అంత దుర్మార్గులా? ముమ్మాటికీ కారు. సమస్య ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ఇంత లోతుగా ఆలోచించరు. మనిషన్నాక చిన్న చిన్న తప్పులైనా చెయ్యడం సహజం. ఆ తప్పులన్నీ క్షమించేసి ఏ కష్టం లేకుండా కేవలం క్రైస్తవుడైనంత మాత్రానికే శాస్వత స్వర్గం వచ్చేస్తుంది అంటే వద్దనే వారెవరు? అది అందరికీ కావాలి. అయితే ఇది నిజం అని నమ్మడానికి మాత్రం అజ్ఞానం తప్పని సరి. అందుకే మొదటే చెప్పినట్లు క్రైస్తవం నిజం అని నమ్మాలి అంటే అజ్ఞానం అలానే అజ్ఞానం తో కూడా స్వార్ధం తప్పని సరి. కొంచెం లోతైన విశ్లేషణ చేస్తే ఇది నిజం కాదు అనే కాకుండా, ఇది చాలా నీచమైన విషయం అని కూడా అర్ధమవుతుంది.

పోలీసు న్యాయ వ్యవస్థ లేని ఒక దేశం కనుక ఈ మూఢ నమ్మకాన్ని నమ్మితే ఆ దేశం పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎవరి చెల్లి, భార్య క్షేమంగా ఉండలేదు. రాక్షసత్వం రాజ్యమేలుతుంది. మనిషి జంతువు కన్నా హీనంగా తయారవుతాడు. నేను తప్పు చేసి ఇక్కడ శిక్ష తప్పించుకున్నా ఆ దేవుడి దగ్గర తప్పించుకోలేను అన్న నమ్మకం, ఒక సమాజానికి చాలా అవసరం. ఆ భయాన్ని మనిషిలో కల్పించేది కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ధార్మిక మతాలు (హిందూ, బౌద్ధ, జైన, సిఖ్ఖు) మాత్రమే. అందువల్లనే మన కన్నా ఎంతో మెరుగైన పోలీసు అలానే న్యాయ వ్యవస్థ ఉన్నా మన దగ్గర కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మనాభంగాలు ఐరోపా దేశాలలో జరుగుతున్నాయి.

పాప పుణ్యాలతో సంబంధం లేకుండా కేవలం మతం కారణం గా దేవుడు స్వర్గం లేదా నరకం ఇస్తాడు అనే నమ్మకం అబద్దం మాత్రమే కాదు ప్రమాదకరం కూడా. దేవుడు అంత వెర్రి వాడు కాడు. అందుకే అంటోంది, క్రైస్తవానికీ దేవుడికీ సంబంధం లేదు. క్రైస్తవం, కేవలం మనిషిలో ఉన్న స్వార్ధాన్ని, అజ్ఞానాన్ని ఉపయోగించుకోని వారిని నియంత్రించడం ద్వారా అధికారాన్ని, ధనాన్ని పొందడానికి కొందరు స్వార్ధపరులు సృష్టించింన ఒక అబద్దపు సిద్ధాంతం మాత్రమే. దానికి దేవుడితో ఎటువంటి సంబంధమూ లేదు.

Comments