అమ్మ వారి హారతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు

౧. నిఖిల జగదీశ్వరికి నిత్య కామేశ్వరికి
నిగనిగల కర్పూర నీరాజనం!
సత్యశివ సుందరికి శంభు హ్రుదంజనికి
నెనరు తలపుల తోడ నీరాజనం!!

౨. ఆపాదమస్తకము మాంగల్యముల నెలవు
నిండైన తనువునకు నీరాజనం!
నక్షత్ర హారతుల నవ్యమణి హారతుల
గౌరికి పరాంబికకు నీరాజనం!!

౩. కుంభినీధర సుతకు కుంభ హారతులతో
నిత్య పూజల నలరు నీరాజనం!
జగములకు నాధారమైన రాజేశ్వరికి
నిగమమంత్రములతో నీరాజనం!!
అమ్మ వారి నీరాజనం 🙏

Comments

Popular Posts