ఉపాధ్యాయ దినోత్సవం Teachers Day Dr Visalakshi

🙏🙏🙏🙏🙏💐🌹💐

ఉపాధ్యాయ దినోత్సవం.
🙏🙏🙏🙏🙏💐🌹💐

ఆధునిక తత్త్వవేత్త, గొప్ప ఉపాధ్యాయుడు, మన భారతదేశ ప్రథమ  ఉపరాష్ట్రపతి, ద్వితీయ రాష్ట్రపతి అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు దేశ నిర్మాతలు ఉపాధ్యాయులేనని గుర్తించి, భారతీయులందరూ తప్పక ఉపాధ్యాయులను గౌరవించాలనీ, వారి వల్లనే దేశం సర్వతోముఖాభివృధ్ధి పొందుతుందనీ భావించి తన పుట్టిన రోజును ' ఉపాధ్యాయ దినోత్సవం ' గా జరపాలని నిర్ణయించారు. అప్పటి నుంచి మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతూ ఉపాధ్యాయులను సత్కరిస్తూ మన భక్తి ని కృతజ్ఞతలను తెలియ  పరచుకుంటున్నాము.

🙏🙏🙏 ఆచార్య దేవో భవ.  🙏🙏🙏


🙏🙏🙏ఉపాధ్యాయ దినోత్సవం 🙏🙏🙏

నేడే ఉపాధ్యాయ దినోత్సవం !
గురుపూజా దినోత్సవం  !!

విశ్వమునకు గురువు విశ్వోపాధ్యాయుడు సాంబసదాశివుడే  !
వేదస్వరూపుడు ప్రణవ రూపుడు
గాయత్రి రూపుడు సావిత్రి రూపుడు
సంధ్యా రూపుడు ప్రకృతి స్వరూపుడు
హరి స్వరూపుడు హర స్వరూపుడు
గురు స్వరూపుడు గణపతి రూపుడు
షణ్ముఖరూపుడు సకల స్వరూపుడు
దక్షిణామూర్తిగ దత్తాత్రేయగ
జ్ఞాన ప్రదాయక గురువితడే  !

వ్యాసమహర్షిగ వాల్మీకి ఋషిగా
దివ్య మహర్షుల దీప్తి రూపులుగ భాసింతురు గురువులు మనకు  !

ఇలలో మనుజుల దైవము వీరు, గురువులు వీరు.
సూర్యుడు గురువు, చంద్రుడు గురువు,
నక్షత్ర గ్రహతారకలన్నీ గురువులె మనకు !
వ్యోమం గురువు, వర్షం గురువు,
ఋతువులు కూడా గురువులె మనకు !

జగద్గురువులు ఆదిశంకరాచార్యులే గురువులందరికి !
త్రిమత కర్తలు ఆచార్యవరులు ఎందరో, అందరూ, గురువులు మనకు !
దక్షిణామ్నాయ శృంగేరీమఠ జగద్గురువులు గురువులు మనకు
శంకర సేవా సమితి సభ్యులకు కాంచీ గురువులే జగద్గురువులు !
నాలుగు మఠాల పీఠాధిపతులు జగద్గురువులే మనకందరికీ !
పుష్పగిరి పీఠాధిపతులు, సర్వ మఠముల అధిపతులు గురువులే !

తల్లి యె గురువు, తండ్రియె గురువు,
విద్యను నేర్పెడి వారలు గురువులు,
కవికుల గురువులు, కావ్య ప్రణీతలు గురువులు మనకు !

సంఘం గురువు, శబ్దం గురువు,
జీవితమే మన గురువు ;
అనుభవమే మన గురువు !
అసంఖ్యాకమౌ గురువులు కలరు.
తప్పులు దిద్దీ ఒప్పులు నేర్పే నేర్పరులంతా గురువులె మనకు  !
ప్రాజ్ఞులు విజ్ఞులు సర్వజ్ఞ సదృశులు ప్రవచన కర్తలు గురువులు మనకు !

ఋషిపీఠం సముదాయమ్మునకు, బ్రహ్మ శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారే గురువులు !
శంకర సేవా సమితి సముదాయ సభ్యులకు సందేహము తీర్చే గురువులు బ్రహ్మశ్రీ చిర్రావూరి శివరామకృష్ణ గారు గురువులు !
రసజ్ఞభారతి సముదాయమునకు త్రిమూర్తి సదృశులు శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ గురువు గారు, శ్రీ బులుసు వేంకటేశ్వరులు మాష్టారు గారు,
శ్రీ రామారావు మాష్టారు గారు
ముగ్గురు గురువులు,  మరెందరో గురువులు !

వందనములు అందరికిని సుమగంధచందనములతో నర్పింతును భక్తి మీర నానందముతో గొని నన్నాశీర్వదింప ప్రార్ధింతు మదిన్.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments