మహాదేవునకు నీరాజనాలు , ఆల్బం: ధన్యోస్మి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

మహాదేవునకు నీరాజనాలు సమర్పించే కీర్తన...

ఆల్బం: ధన్యోస్మి
వ్రాసినవారు: బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

శివ శివ మహాదేవ! శంభో మహాదేవ! నీలకంఠా! నీకు నీరాజనం (పల్లవి).

సామి సామేని సొగసైన గౌరమ్మ నిఖిల జననీ నీకు నీరాజనం
అంతరాయమ్ములను అంతమొందించేటి గణనాయకా నీకు నీరాజనం
శక్త్యాయుధమ్ముతో సకలమును పాలించు దేవషణ్ముఖ విభో! నీరాజనం  .... పల్లవి....

దక్షమఖ విధ్వంస భద్ర ఫలదాయకా! వీరభద్రా! నీకు నీరాజనం
శంభు వాహనమ! సితశైలాభ దేహ! వీర నందీశ్వరా! నీరాజనం
ప్రభుసేవలో మురియు  ప్రమథవరులార! నిత్య శివమయులారా! నీరాజనం  .... పల్లవి....
శివ నీరాజనం

Comments

Popular Posts