#క్రైస్తవ_మతోన్మాదం The Goa Inquisition: Christian : Religious fanaticism

#క్రైస్తవ_మతోన్మాదం The Goa Inquisition - భారత దేశ చరిత్రలో పోర్చుగీసు వారు క్రైస్తవేతరులపై సాగించిన దారుణ మారణ కాండ .క్రీ .శ 1542 వ సంవత్సరం లో ఫ్రాన్సిస్ జేవియర్ అనే చర్చ్ ఫాదర్ భారత దేశంలో క్రీస్తు సువార్త ప్రకటించడానికి గోవా వచ్చాడు.కొత్తగా క్రైస్తవ మతం పుచ్చుకున్న భారతీయులు పాత హిందూ ఆచారాలను వదులుకోకుండా పాటించడం అతనికి కంటి మీద కునుకు లేకుండా చేసింది .బలవంతపు మత మార్పిడి వల్ల క్రైస్తవం తీసుకున్నా రహస్యంగా హిందూ దేవీ దేవతలని ఆరాధించడం అతనికి భరింపరానిదిగా తయారు అయ్యింది.ఈ పరిస్థితులను మార్చడం కోసం పోర్చుగీసు వారిని దీనిపై Inquisition (విచారణ) జరపవలసిందిగా పోర్చుగీసు రాజు అయిన కింగ్ జాన్3 ని కోరాడు .ఇది హిందువులతో పాటు భారతదేశంలో తల దాచుకుంటన్న యూదుల పట్ల కూడా మరణ శాసనం అయ్యింది . ఇక అక్కడి నుండి మొదలైంది హిందూ,యూదుల దారుణ మారణ కాండ .1559 వ సంవత్సరంలో హిందూ ఆలయాల కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చింది పోర్చుగీసు ప్రభుత్వం .పూర్తిగా హిందూ ఆచారాలు ,సంప్రదాయాలు నిషేధించబడ్డాయి. ఆఖరికి హిందూ సాంప్రదాయంలో పెళ్ళిళ్ళు కూడా నిషేధించబడ్డాయి .15 సంవత్సరాల పై బడ్డ ప్రతీ ఒక్కరూ క్రైస్తవ సువార్తలను విని తీరాలి అని హుకుం జారీ చేయబడింది. " హిందువులు అపవిత్రులు ,అబద్ధాల కోరులు ,నయ వంచకులు ..వారు అత్యంత అసహ్యకరమైన నల్లటి విగ్రహాలను పూజిస్తారు " .ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు .ఈ దారుణ మారణ కాండకు కారకుడు అయిన ఫ్రాన్సిస్ జేవియర్ . ఇక క్రైస్తవ మతం స్వీకరించడానికి ఇష్టపడని వారికి విధించే శిక్షలు వింటే మన రక్తం మరగక మానదు .నిందితులుగా పేర్కొనబడిన వారి నాలుకలు చీరడం ,బ్రతికి ఉండగానే చర్మం వలిచి వేయడం ,స్త్రీ పురుషుల మర్మావయవాలలో ఎర్రగా కాల్చిన ఇనుప ఊచలను దించడం ,వాటితో వారిని అంధులను చేయడం .తల్లిదండ్రుల ఎదుటే పిల్లల అవయవాలను ఖండించడం ....ఇలా చెప్పుకుంటూ పోతే వారి అకృత్యాలకు అంతే లేదు .నడి రాత్రిలో కూడా గోవా వీధుల వెంట నడుస్తుంటే వినిపించే హాహాకారాలు ,ఆర్తనాదాలతో భయంకరమైన వాతావరణం ఉండేది . ఈ పరిస్థితి దాదాపుగా 252 సంవత్సరాలు ఉందంటే నమ్ముతారా .ఏ హిందువు అయినా దైవ నామ స్మరణ చేసినా ,వారి ఇంటిలో చిన్న విగ్రహం గాని తులసి మొక్క గాని ఉన్నా అంతే సంగతులు .ఏ హిందువుకీ ఉద్యోగం ఇచ్చే ప్రసక్తే లేదు. అనేకమంది గౌడ సరస్వతి వర్గానికి చెందిన బ్రాహ్మణులు బలవంతంగా మతం మార్బడ్డారు.మిగిలిన వారు కర్ణాటక ప్రాంతంలోని మంగళూర్ ,కేరళ కొచ్చిన్ ప్రాంతానికి పారిపోయారు . ఇదంతా పోర్చుగీసు వారిచే నియమించబడిన ఒక న్యాయాధిపతి పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా జరిగింది .ఇదంతా 16-19 శతాబ్ధంలో జరిగింది .. Disclaimer: This article is sourced from internet and reproduced here, if you have any objections or comments , please send me a message

Comments