Threat posed to Hinduism by religious conversions: Vadiyala Ranjith Kumar

క్రైస్తవ వ్యాప్తి వలన ప్రమాదం లేదు అనుకొనే వారు ఈ పోస్ట్ జాగ్రత్తగా చదవండి. చదివించండి

రచన: వాడియాల రంజిత్ కుమార్

రోమన్ కాథలిక్ చర్చికి చెందిన ఆర్చ్ బిషప్ థామస్ మాక్వన్ గుజరాత్ ఎన్నికల సందర్భంగా క్రైస్తవులకి ఒక లేఖ రాశారు. ఇందులో ఈయన పరోక్షంగా భాజపా కి వోట్ వెయ్యద్దు అని కాంగ్రెస్ కి వెయ్యమని, వారు గెలవాలని ప్రార్ధనలు చెయ్యమని కోరారు. “భాజపా ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో చుర్చీలపై, చర్చికి సంబంధించిన వ్యక్తులపై రోజూ దాడులు జరుగుతున్నాయి, అలానే మైనారిటీలలో, OBC లలో, BC లలో, పేదలలో అభాద్రాతా భావం పెరిగిపోతోంది” అనేవి దానికి ఆయన చెబుతున్న కారణాలు. చాలా చిన్న విషయంలా కనబడే ఈ లేఖ నిజానికి చాలా ముఖ్యమైనది, ప్రమాదకరమైనది. ప్రతీ హిందువు, దేశ భక్తుడు ఆలోచించాల్సిన అవసరం ఉన్న అంశం ఇది.

ఈ లేఖలో మూడు ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి.

1. కాంగ్రెస్ కి వోట్ వెయ్యమని చెప్పడానికి ఆయన ఎంచుకున్న కారణాలు
2. వ్యవస్థీకృత మతాల వలన దేశ ఐఖ్యతకి, బద్రతకి ఉన్న ప్రమాదం
3. జాతీయ వాదాన్ని వ్యతిరేకించడం

మొదటి సమస్య

“చుర్చీలపై, చర్చికి సంబంధించిన వ్యక్తులపై దాడులు పెరిగిపోయాయి” అనే ఆయన ఆరోపనకి ఆర్చ్ బిషప్ గారు ఎటువంటి ఆధారాలు చూపించలేదు. ఢిల్లీ ఎన్నికల ముందు కూడా ఇదే జరిగింది. నిజాయితీ ఉన్న వ్యక్తి అయితే 2014 ముందు ఇన్ని జరిగేవి, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి అని గణాంకాలు చూపేవారు. కానీ ఆయన కేవలం ఆరోపణ చేసారంతే. అయితే చర్చీలపై దాడులు జరగట్లేదా? జరుగుతున్నాయి. చర్చీల మీద మాత్రమె కాదు, దేవాలయాల మీద కూడా జరుగుతున్నాయి. కొన్ని లక్షల చర్చీలు, దేవాలయాలు ఉన్న దేశం లో అక్కడక్కడా దాడులు జరగడం సహజం. మనదేమీ రామ రాజ్యం కాదు కద. భాజపా రాక ముందు కంటే ఇప్పుడు పెరిగినట్లయితే అప్పుడు ఆర్చ్ బిషప్ గారి వాదనకి విలువ. అలా కాని పక్షంలో ఇది ఆయన ఉద్దేశ పూర్వకంగా క్రైస్తవులలో అభద్రతా భావాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నంగానే మనం భావించాలి. దీనిని క్రూరత్వ సాహిత్యం అంటారు. ఇది దేశాలని, సంస్కృతులని నాశనం చెయ్యడానికి పాశ్చాత్యులు గత 500 సం. లుగా,  మాధ్యమ రంగ సహకారంతో, ఉపయోగిస్తున్న మానసిక ఆయుధం. బైబిల్ దేవుడు కూడా ఇలానే, విగ్రహారాధన చేస్తున్నారు, అన్య దేవతలని ప్రార్ధిస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, పిల్లలని బలి ఇస్తున్నారు అనే కారణం చూపించి జాతులకి జాతులనీ పసి పిల్లలతో సహా చంపించేసి నట్లు బైబిల్ లో ఉంటంది. బహుసా వీరికి ఆదర్శం బైబిలే. ఈ అంశం గురించి మరింత తెలుసుకోవాలి అనుకునే వారు నేను రాసిన ఈ వ్యాసం చదవండి - http://indiafacts.org/atrocity-literature-dismantle-hinduism-telugu/

రెండో సమస్య

మన దేశ మనుగడకి ఇది అత్యంత కీలకం. దీనిని అందరూ, క్రైస్తవులతో సహా, తెలుసుకోవాలి. వ్యవస్థీకృత మతాలతో ఉన్న అతి పెద్ద సమస్య ఇది. ఈ లేఖ రాసిన వ్యక్తి రోమన్ కాథలిక్ చర్చిలో ఒక ఆర్చ్ బిషప్ గా పని చేస్తున్నారు. రోమన్ కాథలిక్ చర్చి కేంద్ర కార్యాలయం వాటికన్ సిటీలో ఉంది. దానికి అధిపతి పొప్. అంటే ఇక్కడ మన దేశంలో ఉన్న ఆర్చ్ బిషప్ థామస్ మాక్వన్ గారు వాటికన్ సిటీ లో ఉన్న పొప్ గారికి రిపోర్ట్ చేస్తారు. ఎలా అయితే ఒక కంపెనీ అధిపతి తన కంపనీలో పని చేసే క్రింది స్థాయి ఉద్యోగితో తనకి కావాల్సిన పని చేయించుకోగలడో, అలానే పొప్ గారు కూడా కావాలనుకుంటే థామస్ గారితో తనకు కావాసిన పని చేయిన్చుకోగలరు. మరో విదంగా చెప్పాలి అంటే వాటికన్ లో ఉన్న పొప్ గారు, మన దేశం లోని ఆర్చ్ బిషప్ థామస్ మాక్వన్ వంటి వారి ద్వారా భారతీయ క్రైస్తవులని ప్రభావితం చేసి తాను అనుకున్న పార్టీకి వోట్ వేయించగలరు. అంటే మన దేశ ప్రజలు ఎవరికి వోట్ వెయ్యాలి అనే విషయాన్ని చర్చి అనే ఒక వ్యవస్థీకృత సంస్థ ద్వారా ఒక విదేశీయుడు నిర్ణయించగలడు.

కొంచెం లోతుగా ఆలోచిస్తే ఈ విషయం ఎంత ప్రమాదకరమో అర్ధం అవుతుంది. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ని తీసుకుందాం. ఇక్కడ క్రైస్తవ జనాభా 60% కి పెరిగింది అనుకుందాం. మొత్తం జనాభా 10 కోట్లు అనుకుంటే, క్రైస్తవులు 6 కోట్లు అన్నమాట. ఆర్చ్ బిషప్ థామస్ గారు ఎలా అయితే తమ శాఖకి చెందిన క్రైస్తవుల చేత కాంగ్రెస్ కి వోట్ వేయించడానికి ప్రయత్నిస్తున్నారో, అలానే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వివిధ శాఖలకి చెందిన చర్చి అధికారులు వారి వారి శాఖలకి చెందిన క్రైస్తవులని తమకి కావాల్సిన రాజకీయ పార్టీ కి వోట్ వేసే విదంగా ఆంధ్రా క్రైస్తవులని ప్రభావితం చెయ్యగలరు. ముందే చెప్పినట్లు వీరి శాఖల ప్రధాన కార్యాలయాలు, అధిపతులూ చాలా వరకూ విదేశాలలో ఉంటారు కనుక వారు కావాలి అనుకుంటే మన దేశం లో ఉన్న ఆయా శాఖల అధికారుల ద్వారా వోట్ విషయంలో అలానే ఇతర విషయాలలో మన దేశ క్రైస్తవులని ప్రాభావితం చెయ్యగలరు. నిక్కచ్చిగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులు 30% శాతం దాటిపోతే, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు, వాళ్ళు ఏమి చెయ్యాలి అనే విషయాన్నీ విదేశాలలో ఉండే ఈ చర్చి శాఖల అధిపథులూ నిర్ణయిస్తారు. అది రాష్ట్రానికి ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఇస్లాం తో కోడా ఈ సమస్య ఉంది. ఎలా అయితే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాలలో ఉండే తమ ముఖ్యమంత్రుల్ని ఆదిస్తుందో అదే విధంగా ఈ విదేశీ చర్చి అధిపతులు మన రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని ఆడిస్తారు. అంటే రాష్ట్రం మనది కానీ అధికారం వారిది. ఇది మరో రకమైన వలస పాలన, ఒక రకమైన బానిసత్వం. ప్రస్తుతం మనం ఇటువంటి పరిస్థితులని నాగాలాండ్, మిజోరాం లాంటి క్రైస్తవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో చూడవచ్చు. ఇదే పరిస్థితి దేశం అంతా వస్తే? ఆలోచించడానికే భయంగా ఉంది కదు? క్రైస్తవ వ్యాప్తి ఈ విధంగా దేశాన్ని మరో సారి పరోక్ష వలస పాలనలోకి నేట్టివేయ్యగలదు.

ప్రస్తుతం ఆఫ్రికా లో చాలా దేశాలలో ఈ పరిస్థితి ఉంది. చిన్న చిన్న దేశాలు అవ్వడం వలన, అధిక శాతం క్రైస్తవులు ఉన్న దేశాలని చర్చి అధిపతులు ప్రభావితం చేస్తారు. కొన్ని కొన్ని దేశాలలో క్రైస్తవం అలానే ఇస్లాం రెండూ బలంగా ఉన్నాయి. అటువంటి కొన్ని చోట్ల ఈ జోక్యం అంతర్యుద్దానికి కూడా దారితీసింది. తీస్తోంది. రవాండా నరమేధం లో పది లక్షల మంది చనిపోయిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దానిలో చర్చి పాత్రని అంగీకరిస్తూ పొప్ క్షమాపణ కూడా చెప్పారు.

క్రైస్తవం తో మాత్రమె కాదు, వ్యవస్థీకృతంగా నడిచే ఇస్లాం తో కూడా ఇదే సమస్య. హిందువులు ఇప్పటికైనా మేలుకోక పోతే, ఏకం కాకపోతే మనం ఈసారి పరోక్ష విదేశీ పాలనలోకి వెళ్ళిపోవడం ఖాయం. క్రైస్తవులు కూడా ఈ విషయం ఆలోచించండి. మతాలు వేరైనా ఈ దేశం మనందరిదీ, దీనిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.

http://indianexpress.com/elections/gujarat-assembly-elections-2017/gandhinagar-archbishop-to-followers-pray-for-election-of-humane-leaders-4950410/

భారత్ మాతాకీ జై

Comments