Nehru role in current Modern Bharat history- By Vadiyala Ranjith Kumar

ఆధునిక చరిత్రలో మన దేశానికి అత్యధికంగా నష్టం కలిగించిన వ్యక్తి బహుశా జవహర్లాల్ నెహ్రు

రచన: వాడియాల రంజిత్ కుమార్

కొన్ని కారణాలు

1. వందల కొద్దీ సంస్థానాలని దేశంలో ఐఖ్యం చేసిన సర్దార్ పటేల్ గారిని పక్కన పెట్టి కేవలం వ్యక్తిగత స్వార్ధంతో కాశ్మీర్ అంశాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఇంత పెద్ద సమస్య కి కారణం అయ్యారు.

2. పాకిస్తాన్ పై యుద్ధంలో గెలిచి కూడా, వాళ్ళ భూబాగాన్ని ఆక్రమించడం పక్కనుంచి, కనీసం వాళ్ళు ఆక్రమించుకున్న మన భూబాగాన్ని కూడా తిరిగి తీసుకోకుండా, బహుసా నోబెల్ శాంతి బహుమతి కోసం, భారత సైన్యాన్ని వినక్కి పిలిపించేసి, అంశాన్ని ఐఖ్య రాజ్య సమితికి నివేదించి, ద్వైపాక్షిక అంశాన్ని అంతర్జాతీయం చేసి, కాశ్మీర్ సమస్యని జటిలం చేశారు.

3. అమెరికా ప్రభుత్వం పిలిచి మరీ ఐఖ్యరాజ్య సమితి లో శాశ్వత సభ్యత్వం ఇస్తానంటే వద్దని, పట్టుబట్టి మరీ దానిని చైనాకి ఇప్పించారు. పైకి పాకిస్తాన్ లా కనబడ్డా, మనకి ప్రధాన శత్రువు చైనా.

4. నేపాల్ ప్రభుత్వం మనకి స్వతంత్రం వచ్చాక తమ దేశాన్ని మన దేశంలో విలీనం చేస్తాము అని అంటే నెహ్రు గారు నిరాకరించారు. మన దేశానికి కీలకమైన చాలా నదులు హిమాలయాలలో అదీ నేపాల్ లో పుట్టాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా ఆ దేశం చైనా నియంత్రణలోకి వెళ్ళిపోతే అది మన దేశ ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తుంది. అందుకే మనకి నేపాల్ అంత కీలకం.

5. 1970 ల వరకూ చైనా మన కన్నా శక్తివంతమైన దేశమేమీ కాదు. పాకిస్తాన్ ఇక మన మీద దాడి చెయ్యను అని ఒప్పందం కుదుర్చుకుంది, కమ్యునిస్ట్ దేశం ఎప్పటికీ మన మీద దాడి చెయ్యదు అని గుడ్డి నమ్మకంతో ఒక సమయం లో మనకి సైన్యం అవసరమా అని కూడా ఆలోచన చేసి చివరికి సైన్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసారు నెహ్రు. అదే అదనుగా చైనా మన మీద దాడి చేసి గెలవగలిగింది.

6. ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం స్థాయి నుండి ప్రపంచంలో అత్యంత బీద దేశాలలో ఒకటిగా మన దేశం మారడానికి కారణం ఇస్లాం అలానే బ్రిటిష్ దాడి. ముందు కాలంలో చేసిన తప్పుల నుండి నేర్చుకోవడం చాలా చాలా ముఖ్యం. అందుకే చరిత్ర బోధన. కానీ మన చరిత్రలో ఎక్కడా అటువంటి ఛాయలే కనిపించవు. బ్రిటిష్ వాళ్ళ గురించి కొంత వరకూ నిజాలు చెప్పినా, ఇస్లాం దండయాత్రని మన చరిత్ర పుఠల నుండి పూర్తిగా తొలగించారు. దీనికి కూడా బీజాలు నెహ్రు గారి కాలంలోనే పడ్డాయి. మన నిజమైన చరిత్ర మనకి తెలియకపోవడం వలన, ఇంతక ముందు కాలంలో మనం చేసిన తప్పులు  మళ్ళీ చెయ్యడానికి అవకాసం ఉంది.

7. నెహ్రు గారి వ్యక్తిగత జీవితం కూడా ఏ మాత్రం ఆదర్శవంతం కాదు. ఎడ్వినా మౌంట్బాటన్ తో నెహ్రు గారి సంబంధాలు ఇప్పుడు దాదాపు అందరికీ తెలుసు. ఆవిడ మన దేశానికి స్వతంత్రం వచ్చే సమయం లో బ్రిటన్ నుండి ఇక్కడికి వచ్చిన మౌంట్బాటన్ భార్య. ఆవిడ ద్వారా నెహ్రు గారిని బ్రిటిష్ వారు ప్రాభావితం చేసారు అని అనుమానించడం 100% సహేతుకం. అసలు ఆవిడని ఇక్కడకి తీసుకురావడానికి కారణమే అది అయ్యుంటుంది. లేదంటే వారిద్దరి సంబంధాన్ని చూస్తూ మౌంట్బాటన్ ఎందుకు ఊరుకున్నట్లు? ఈ మధ్యనే ఎడ్వినా మనవడు అతని నాయనమ్మకి నెహ్రు గారికి ఉన్న సంబంధం గురించి బహిరంగానే చెప్పాడు. ఆ విషయం మౌంట్బాటన్ కి తెలుసనీ అయినా ఆయన విశాల హృదయంతో ఏమీ అనలేదని సెలవిచ్చాడు. నెహ్రు గారి స్త్రీలౌల్యం గురించి తెలిసిన బ్రిటిష్ వాళ్ళు ఆయనని వాళ్లకి అనుకూలంగా ప్రభావితం చెయ్యడానికే ఎడ్వినాని ఇక్కడికి పంపి ఉంటారు. దీని వలన నెహ్రు గారు ఎన్ని నిర్ణయాలు మన దేశానికి వ్యతిరేకంగా తీసుకున్నారో? దాని వలన దేశం ఎంత నష్టపోయిందో?

8. నమ్మదగిన సాక్షాలు ప్రస్తుతం అందుబాటులో లేకపోయినా ఆయన సుకవ్యాదుల (Sexually Transmitted Diseases) వలన చనిపోయారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన శరీరంపై “శవ పరీక్ష నిర్వహించారా”?

9. సుభాష్ చంద్ర బోస్ గారి విషయంలో అలానీ ఆయన స్థాపించిన “ఇండియన్ నేషనల్ ఆర్మీ” విషయం లో కూడా నెహ్రు గారి మీద చాలా బలమైన ఆరోపణలు ఉన్నాయి. అలానే గాంధి గారి హత్య దర్యాపు కూడా వివాదాస్పదమే.

నెహ్రు గారి వలన భారతదేశానికి కలిగిన నష్టం అనేది ఒక పెద్ద పరిశోధనా అంశం. భవిష్యత్తులో ఈ అంశం మీద మన విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లు ఇవ్వాలని, నెహ్రు గారి పేరున “బాల దినోత్సవాన్ని” జరపడం మానేసి ఆయన గురించిన నిజాలు మన పిల్లలకి పాఠాలుగా చెప్పాలని కోరుకుంటున్నాను

Comments