తొలిఏకాదశివిశిష్ఠత

" #తొలిఏకాదశివిశిష్ఠత!!

ఆషాడశుద్ధ ఏకాదశిని *తొలిఏకాదశి* అని
ఎందుకు అంటారు??

మనకు రెండు అయనాలున్నాయి!!
1- ఉత్తరాయణం! 2- దక్షిణాయనం!
అందులో దక్షిణాయనములో వచ్చే మొదటి
ఏకాదశి కనుక దీనిని తొలిఏకాదశి అన్నారు!!

#అసలుఏకాదశివ్రతమంటేఏమిటి???

ఐదుకర్మేంద్రియములు,ఐదుజ్ఞానేంద్రియములు పది+మనస్సు ఒకటి ఈ పదకొండింటిని
భగవదర్పణ చేయటమే నిజమైన #ఏకాదశి!!

#ఉపవాసమంటేఏమిటి???

ఉప అంటే సమీపం!! వాసము అంటే
వుండటము అంటే #భగవంతునికి సమీపంగా
వుండి ఉపాసనచేయటమే #ఉపవాసము!!

ఈ ఏకాదశినే #శయనఏకాదశి " అని కూడా అంటారు!!

శ్రీమన్నారాయణుడు పాలకడలిలో
శేషశయ్యపై పవళించే రోజు ఇది!!

అఖిలాంఢ కోటి బ్రహ్మాండనాయకుడు
సకల లోకాల పాలకుడు స్వామి నిద్ర పోవడమేమిటి ??
ఆయన మన లాంటి మానవమాత్రుడు
కాదుగదా!!

సృష్ఠికర్త యైన బ్రహ్మదేవుడు పడుకుంటే
ప్రళయం !! నిద్రలేస్తే సృష్ఠికదా!!

అటువంటి బ్రహ్మకు "#అమ్మ" యై తన నాభి
నుండి ఉధ్భవింపజేసిన నారాయణునికి
నిద్ర ఏమిటండీ???

మరి ఆయన నిజంగానే నిద్రపోతే సకల
లోకాలు అల్లకల్లోములవుతాయి కదా!!

ఆ స్వామీ నిజంగా నిద్ర పోడట!!
నిద్ర లో వున్నట్టుగ నటిస్తాడట!!

#శాంతాకారంభుజగశయనం

స్వామి పడుకునేది పాము మీద!! అదీ
పరమ ప్రశాంతంగా పడుకుంటాడు!!

మనము పామును జూస్తే పదిగజాలు
పారిపోతాము!! అది తేడా!!

జీవుల యొక్క " రాక-పోక"లను లెక్క
కడతాడట!! అకౌంటింగు జేసి మరుజన్మ
కోసం ఎదురుజూసే జీవుల యొక్క తరువాతి
జన్మను ఖరారు చేస్తాడట!!

ఇదీ స్వామివారి" #నాలుగునెలలయోగనిద్ర "

సాధువులుసంతులు, సత్పురుషులు ఈ 4 మాసాలుచాతుర్మాస దీక్ష చేస్తారు!! ఈ నాలుగునెలలు ఎక్కడ పర్యటించక దీక్షాస్థలి లేనే వుంటు అధ్యయన-అధ్యాపనలు చేస్తారు!!
పూజలు ఉపాసనలు చేస్తారు!! ఆహార
నియమాలు కఠినంగా పాటిస్తారు!!

మరిస్వామిఈ నాలుగుమాసాలు మనయొక్క #స్థితిగతులను ి బేరీజువేసి సమీక్ష చేస్తాడట!

"అరే వీడికి నరజన్మ ఇచ్చాను తన కృషితో
నారాయణుడు అవుతాడు అనుకున్నాను!!
మాట్లాడటానికి మాట ఇచ్చాను!ఒకమంచి
మాట మాట్లాడలేదు!!కనీసం ఒకసారి కూడా "#నారాయణ" నామస్మరణం చేయలేదు!!కనీసం "#రామరామ"అనలేదు!! #శివశివ అనలేదు!! జీవితంలో నలుగురితోనడవ లేదు!! నలుగురికీ సహాయపడలేదు!!

చివరికీ నలుగురు మోయనిదే వీడు కాటికి
కూడా ఏగలేడు కదా!!అదీ గ్రహించ లేదువీడు!

స్వార్థముతో, అహంకారంతో,అధర్మముతో
ఆణిముత్యంలాంటి మానవ జన్మను వృధా
చేసుకున్నాడు !! జీవితాంతం అవినీతితో
దోచుకోవడం - దాచుకోడంలోనే వీడు కాలాన్ని వృధా చేసుకున్నాడు!! వీడికి పశు,పక్షి ,కీటక జన్మనే సరైనది "
వీడికి నరజన్మఅవసరం లేదు!!
అనీ "#తిర్యక్ యోనులలో" పడవేస్తాడట!!

ధర్మమార్గంలో నడచిన వారికి ఉన్నతమైన
ఉత్తమమైన జన్మలిస్తాడట!!
సంపూర్ణ కర్మరాహిత్యం అయినవారికి
జన్మరాహిత్యం కలిగించి తనలో లీనం
చేసుకుంటాడట!! అదే వైకుంఠప్రాప్తి!!

మనది,అంటే #ఆకీటబ్రహ్మపర్యంతము మన అందరిదీ "#తామసనిద్ర!!

దేవ దేవునిది మనలాంటి తామస నిద్రకాదు!!
అది " #యోగనిద్ర " !!

"#మహామాయా" ఆయన అధీనములో
వుంటుంది!! మనం మనతోపాటు సకల లోకాలు ఆ "#మాయ" అధీనములో వుంటాము!!

#మాయతొలగాలంటే ఆయన
పాదాలను ఆశ్రయించాలి!!

తామస గుణాన్ని వదలి, సత్వ గుణాన్ని
పెంపొందించుకుని " తామస నిద్ర" ను వదలి
మాయను జయించి మాధవుణ్ని చేరుకోవటం
మానవజన్మ అంతిమ లక్ష్యం కావాలి!!

మానవ సేవే మాధవ సేవగా తలంచి మనల్ని
మనల్ని తరింప జేసుకోవటమే ఈ శయన ఏకాదశి మరియు "తొలి ఏకాదశి" అంతరార్థం!!

ఆధ్యాత్మిక పథములో,ధర్మపథములో
మనమందరం కలసి తొలి ఏకాదశి రోజున
" #తొలిఅడుగులు" వేద్దామా మరి!!??

!! ఓమ్ నమో భగవతే వాసుదేవాయ !!

!! ఓమ్ నమో నారాయణాయ !!

-:ప్రార్థన:-

1 ఓమ్ నమో దేవ దేవాయ పూర్వ దేవాయ ఖడ్గినే!
శ్రీ వత్సాంకాయచ నమః పరస్మై పరమాత్మనే !
నమః పరస్మై వ్యూహ వ్యూహాంతర విభూతం!
విభవాయ నమః తస్మై విశ్వాంతర్యామినే అణవే !!

2 ప్రసీద పుండరీకాక్ష ప్రసీద పురుషోత్తమ!
ప్రసీద పరమానంద ప్రసీద పరమేశ్వర !
ప్రసీద కమలాకాంత ప్రసీద కరుణాకర!
ప్రసీద భక్తార్థి హర ప్రసీద విభుదర్షభ !!

3 యజ్ఞేశ , అచ్యుత , గోవింద , మాదవ , అనంత , కేశవ!
కృష్ణ , విష్ణో , హృషీకేశ , వాసుదేవ , నమెాస్తుతే !!

పాండురంగ విఠలా!!
పండరినాథ విఠలా!!
పాండురంగ హరి గోవిందా!!
రామ కృష్ణ హరి గోవిందా!!

#నారాయణనారాయణనారాయణ!!
-:శుభమ్ భూయాత్ :- -

🙏🌹Srihari Srihari Srihari🌹🙏


Sent from my iPhone

Comments