Answer to a Question about Amma varu Dr Visalakshi
🙏అమ్మవారికి రూపం లేనిమాట నిజం.
కాని, ఏ ధ్యాన శ్లోకం చూసినా
అమ్మవారి రూపవర్ణన ఉంటుందే !
దాని మర్మం వివరించ ప్రార్థన.🙏
🙏💐
🙏🙏🙏💐
పరమాత్మ కు పరబ్రహ్మకు రూపం లేదు. ఉపనిషత్ప్రతిపాదిత పరబ్రహ్మ నిర్గుణ బ్రహ్మమే ! విశ్వాతీతుడుగా, విశ్వవ్యాపక చైతన్య మాత్రక చిత్స్వరూపుడుగా ఉన్న
పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు, రూప హితుడు, గుణరహితుడు. కానీ ఆ పరమాత్మే సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు. ఆ పరబ్రహ్మ సంకల్ప మాత్రంతో బ్రహ్మాండాలన్నీ సృష్టింపబడి విశ్వ నిర్వహణ జరుగుతోంది. ఆ పరమాత్మ ఏయే ఆకారాలతో, ఏయే శక్తులతో, ఏయే ఆయుధాలతో విశ్వ నిర్వహణ కార్యం చేస్తున్నారో, ఆయా రూపాలను మహర్షులు తమ తపోబలంతో, యోగదృష్టితో దర్శించి, ఆయా దేవతల పేర్లను, రూపాలను, శక్తులను, వారి పనులను, వారి అనుగ్రహం వలన మనకు కలిగే ఐహికాముష్మికాఫలాలను గురించి చెప్పి, ఆయా దేవతలను స్తోత్రించి, మనకు ఆ స్తోత్రాలను అనుగ్రహించారు. ఈ సకల చరాచర సృష్టి లో ధర్మ స్థాపన కోసం, ప్రపంచం లో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యటం కోసం పరమాత్మ సమస్త కళ్యాణ గుణాలతో శోభిస్తూ భువికి దిగి వచ్చి తన లీలా ప్రదర్శన చేశాడు. ఆ పరమాత్మ పుంరూపంలో వస్తే భగవంతుడు, స్త్రీ రూపంలో వస్తే భగవతి, జగన్మాత.
చిన్మయస్యాద్వితీయస్య నిష్కలస్యా శరీరిణః !
ఉపాసకానాం కార్యార్ధం బ్రహ్మణో రూప కల్పనా !!
🙏🙏💐

Comments
Post a Comment