*బైబిల్ దేవుడి రాక్షస ప్రేమ* *రచయిత: వాడియాల రంజిత్ కుమార్*

*బైబిల్ దేవుడి రాక్షస ప్రేమ*

*రచయిత: వాడియాల రంజిత్ కుమార్*

బైబిల్ రచయితలకి దేవుడి గారించి ఏ మాత్రం అవగాహన లేదు అని నేను భావించడానికి ముఖ్యమైన కారణం దేవుడుకి కూడా తన పర బేధాలు ఉంటాయి అనేలా వారు దేవుడికి చిత్రీకరించడమే. అసలు క్రైస్తవ మూల సూత్రమే అది. పాప పుణ్యాలతో సంబంధం లేకుండా దేవుడు క్రైస్తవులని స్వర్గానికి మిగిలిన వాళ్ళని నరకానికి పంపుతాడు అని ప్రచారం చెయ్యడం కన్నా దేవుడికి అవమానం లేదు. దేవుడిని తన గ్యాంగ్ వారు కాబట్టి మంచి చేసేసే ఒక దొంగల ముఠా దిగాజార్చేస్తోంది. ఎంత పాపాత్ముడైనా దేవుడంటే ఎంతో కొంత భయం ఉంటుంది. తానూ చేసే పాపాలకి దేవుడు శిక్ష విదిస్తాడు అని, ఎప్పుడైతే తానూ చేసే పాపానికి దేవుడు విధించే శిక్ష కి సంబంధం పోతుందో, ఎప్పుడైతే ఒక మనిషి తన పాప పుణ్యాల ఆధారంగా కాక దేవుడు కేవలం తన మతం ఆధారంగా తన స్వర్గ నరకాలు నిర్ణయిస్తాడు అనే అబద్దం నమ్మడం మొదలేడతాడో అప్పుడు ఇక వాడి పాపాలు మరింత పెరిగిపోతాయి. కారాగారాలలో (జైలు) కూడా మత మార్పిడులు చేస్తారు. బహుశా వారికి మీరు ఎన్ని పాపాలు చేసినా పర్లేదు మీరు మా మతంలోకి వచ్చేస్తే దేవుడు మీకు స్వర్గం ఇచ్చేస్తాడు అని చెప్తారు.

తానూ స్థాపించిన మతం వారి పట్ల దేవుడు పక్షపాతం చూపిస్తాడు అనేలా దేవుడిని చిత్రీకరించడమే నీచం అనుకుంటే కేవలం తనని పూజించడం లేదని ఆయన మనుషులని శిక్షిస్తాడు అని చెప్పడం మరీ ధారుణం. ఇటువంటి ఉదంతాలు బైబిల్ లో, ముఖ్యంగా పాత నిభందనలో చాలానే ఉన్నాయి. కేవలం తనని ప్రేమించడం లేదు కాబట్టి మనుషులని శిక్షించడం దైవ ప్రేమ కాదు. రాక్షస ప్రేమ కూడా అంత ఘోరంగా ఉండదు. అసలు అది ప్రేమే కాదు. ప్రేమ లక్ష్యం మనం ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలి అనుకోవడం. అంతే తప్ప నన్ను ప్రేమించడం లేదు కాబట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తా అనడం ప్రేమ కాదు. నిజానికి భారతీయ భాషలలో దానికి పేరు లేదు. బహుసా బైబిల్ దేవుడి ప్రేమ అనాలేమో. బైబిల్ లో చెప్పిన విధంగా దేవుడు చేస్తాడా చెయ్యడా అనేది అర్ధం కావాలంటే ఒక చిన్న పని చెయ్యాలి. మిమ్మల్ని మీరు దేవుడు స్థానంలో, ఆయన శిక్షించిన వారిని మీ పిల్లల స్థానంలో ఊహించుకోండి. కేవలం మీ మీద పిల్లలు ప్రేమ చూపించడం లేదు కాబట్టి మీరు పిల్లలకి అన్నం, నీళ్ళు ఇవ్వకుండా కడుపు మాడ్చి చంపేస్తారా? అలా కనీసం రాక్షసులు కూడా చెయ్యరే మరి దేవుడు అలా ఎలా చేస్తాడు?  

కేవలం తనకి పూజలు చెయ్యడం లేదని, లేదా తనని కాదని వేరే వాళ్లకి పూజలు చేస్తున్నారు అని బైబిల్ దేవుడు ఆ ఇశ్రాయేలీయులని నానా హింసలు పెట్టినట్లు బైబిల్ లో చాలా సార్లు ఉంటుంది. ఆమోసు కాండము నుండి నేను ఒక ఉదాహరణ చెప్తాను.

ఆమోసు కాండము 4: 6 నుండి 11 వాక్యాలు ప్రకారం కేవలం ఇశ్రాయేలీయులు ఆయన దగ్గరికి రాలేదు అని యెహోవా వారికి విధించిన శిక్షలు ఇవి

1. తిండి నీళ్ళు లేకుండా చేస్తాడు
2. వానలని ఆపెయ్యడం ద్వారా, పురుగుల్ని పంపడం ద్వారా వారి పంటలని నాశనం చేసేస్తాడు
3. వాళ్ళలో ఉన్న యువకులని కత్తులతో నరికి చంపేస్తాడు

దేవుడి గురించి అసలు ఇంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. దేవుడు దృష్టిలో పేడ పురుగు అమెరికా అధ్యక్షుడు రెండూ ఒక్కడే. ఒక మతానికి చెందిన వారి పట్ల పక్షపాతం చూపించే వాడు, నన్ను పూజించండ్రో అని అడుక్కునే వాడు, బెదిరించే వాడు దేవుడెలా అవుతాడు.

కేవలం భూమి భాగమైన పాలపుంత అనే నక్షత్ర వీధి లోనే 10 వేల నుండి 40 వేల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అని ప్రస్తుత అంచన. పాల పుంత లాంటి నక్షత్ర వీధులు ఈ విశ్వంలో కొన్ని కోట్లు ఉన్నాయి. అంటే 10 వేల కోట్ల నక్షత్రాలు ఉన్న పాలపుంతే ఈ అనంత విశ్వంలో సముద్రంలో నీటిబొట్టు అందులో సూర్యుడెంత, భూమెంత, భూమి మీద ఇస్రాయెల్ దేశమెంత, ఆ దేశ ప్రజలెంత? ఈ అనంత విశ్వం ఒక మహా సముద్రం అయితే ఇస్రాయెల్ దేశం ఒక నీటి చుక్క కూడా కాదు. ఇంతటి విశ్వాన్ని సృష్టించి, నడిపిస్తున్న ఆ దేవుడు ఎడారిలో ఇసుకరేణువు లాంటి ఒక దేశ ప్రజలు, లేదా మిగిలిన ప్రజలని తనని పూజించమని వెంటబడతాడా, దేబిరిస్తాడా? పూజించలేదని శిక్షిస్తాడా? దేవుడికి అసలు ఇంతకన్నా అవమానం ఇంకేమైనా ఉందా? బైబిల్ రచయితలకి దేవుడు స్వభావం అర్ధం కాలేదు అని చెప్పడానికి ఇంతకన్నా సాక్షం ఎం కావాలి?

Comments